Share News

King Cobra తెన్నుఖర్జలో కింగ్‌ కోబ్రా

ABN , Publish Date - Sep 13 , 2025 | 12:04 AM

King Cobra in Tennukharja కురుపాం మండల కేంద్రానికి అతి సమీపంలో ఉన్న తెన్నుఖర్జ గిరిజన గ్రామంలో శుక్రవారం కింగ్‌ కోబ్రా హల్‌చల్‌ చేసింది. దీంతో స్థానికులు హడలిపోయారు.

King Cobra  తెన్నుఖర్జలో కింగ్‌ కోబ్రా
ఓ ఇంటిలో చేరిన కింగ్‌ కోబ్రా

కురుపాం రూరల్‌, సెప్టెంబరు 12(ఆంధ్రజ్యోతి): కురుపాం మండల కేంద్రానికి అతి సమీపంలో ఉన్న తెన్నుఖర్జ గిరిజన గ్రామంలో శుక్రవారం కింగ్‌ కోబ్రా హల్‌చల్‌ చేసింది. దీంతో స్థానికులు హడలిపోయారు. సుమారు 12 అడుగులున్న ఆ విష సర్పం గ్రామానికి చెందిన తిమ్మిక సోమందొర ఇంట్లో చేరింది. ఓ మూలన నక్కి ఉన్న దానిని చూసి అక్కడున్న వారు తీవ్ర భయాందోళన చెందారు. వెంటనే గ్రామస్థులు అటవీశాఖ అధికారులకు సమాచారం అందించారు. ఫారెస్ట్‌ రేంజ్‌ అధికారి గంగరాజు తన సిబ్బందితో గ్రామానికి చేరుకున్నారు. అయితే అప్పటికే ఆ పాము అక్కడి నుంచి వెళ్లిపోయింది. కాగా మళ్లీ ఆ విష సర్పం ఎక్కడ తిరిగొస్తుందోనని తెన్నుఖర్జ గ్రామస్థులు ఆందోళన చెందుతున్నారు. ఇటీవల ఇదే మండలం కిచ్చాడలో, కొద్ది రోజుల కిందట సీతంపేటలోని జనావాసాల్లోకి కింగ్‌ కోబ్రా వచ్చిన విషయం తెలిసిందే. వాటివల్ల ఎటువంటి ప్రాణనష్టం జరగకముందే సంబంధిత అధికారులు స్పందించి తగు చర్యలు తీసుకోవాలని గిరిజనులు డిమాండ్‌ చేస్తున్నారు.

Updated Date - Sep 13 , 2025 | 12:04 AM