Share News

King Cobra బత్తిలిలో కింగ్‌ కోబ్రా

ABN , Publish Date - Sep 16 , 2025 | 12:02 AM

King Cobra in Battili బత్తిలి వంశధార నదీతీరాన సవరవీధిలో సోమవారం సాయంత్రం కింగ్‌ కోబ్రా హల్‌చల్‌ చేసింది. ఓ ఇంటిలోని చేరి బుసలు కొట్టడంతో స్థానికులు హడలిపోయారు. వెంటనే పాములు పట్టే వ్యక్తిని రప్పించారు. ఆ స్నేక్‌ క్యాచర్‌ చాకచక్యంగా వ్యవహరించి సుమారు 12 అడుగుల ఉన్న కింగ్‌ కోబ్రాను పట్టుకుని.. సుదూర ప్రాంతాల్లో విడిచిపెట్టారు. దీంతో ఆ ప్రాంతవాసులు ఊపిరిపీల్చుకున్నారు.

 King Cobra   బత్తిలిలో కింగ్‌ కోబ్రా
బత్తిలిలో ఓ ఇంటిలో చేరిన విష సర్పం

భామిని, సెప్టెంబరు 15(ఆంధ్రజ్యోతి): బత్తిలి వంశధార నదీతీరాన సవరవీధిలో సోమవారం సాయంత్రం కింగ్‌ కోబ్రా హల్‌చల్‌ చేసింది. ఓ ఇంటిలోని చేరి బుసలు కొట్టడంతో స్థానికులు హడలిపోయారు. వెంటనే పాములు పట్టే వ్యక్తిని రప్పించారు. ఆ స్నేక్‌ క్యాచర్‌ చాకచక్యంగా వ్యవహరించి సుమారు 12 అడుగుల ఉన్న కింగ్‌ కోబ్రాను పట్టుకుని.. సుదూర ప్రాంతాల్లో విడిచిపెట్టారు. దీంతో ఆ ప్రాంతవాసులు ఊపిరిపీల్చుకున్నారు. వంశధార వరదల కారణంగా విష సర్పం ఇక్కడకు కొట్టుకొచ్చినట్టు వారు చెబుతున్నారు. ఎటువంటి ప్రాననష్టం జరగకముందే సంబంధిత అధికారులు స్పందించాలని గ్రామస్థులు కోరుతున్నారు. పాలకొండ అటవీశాఖ రేంజర్‌ రామారావును వివరణ కోరగా.. ‘ బత్తిలిలో కింగ్‌ కోబ్రా సంచరించిన విషయం మా దృష్టికి రాలేదు. ఎక్కడైనా అది కనిపిస్తే మాకు సమాచారం ఇవ్వాలి. స్నేక్‌ క్యాచర్స్‌తో దానిని పట్టుకుని అటవీ ప్రాంతంలో విడిచిపెడతాం. గెడ్డలు, వాగులున్న ప్రదేశాలకు ఈ సీజన్‌లో కింగ్‌ కోబ్రాలు చేరుతుంటాయి. ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. ’ అని తెలిపారు.

Updated Date - Sep 16 , 2025 | 12:02 AM