కేజీబీవీ విద్యార్థినుల డిశ్చార్జి
ABN , Publish Date - Oct 30 , 2025 | 12:10 AM
నెల్లిమర్ల సామాజిక ఆరోగ్య కేంద్రం నుంచి గుర్లలోని కేజీబీవీ పాఠశాల విద్యార్థినులు బుధవారం డిశ్చారయ్యారు. మంగళ వారం రాత్రి గుర్ల కేజీబీవీలో షార్ట్ సర్క్యూట్ కావడంతో పరుపులు తగలబడి పొగ వ్యాపించి ఐదుగురు విద్యార్థినులు అస్వస్థతకు గురయ్యారు. దీంతో ఆ విద్యార్థి నులను గురైన నెల్లిమర్ల సీహెచ్‌సీకి తరలించారు.
నెల్లిమర్ల, అక్టోబరు 29(ఆంధ్రజ్యోతి): నెల్లిమర్ల సామాజిక ఆరోగ్య కేంద్రం నుంచి గుర్లలోని కేజీబీవీ పాఠశాల విద్యార్థినులు బుధవారం డిశ్చారయ్యారు. మంగళ వారం రాత్రి గుర్ల కేజీబీవీలో షార్ట్ సర్క్యూట్ కావడంతో పరుపులు తగలబడి పొగ వ్యాపించి ఐదుగురు విద్యార్థినులు అస్వస్థతకు గురయ్యారు. దీంతో ఆ విద్యార్థి నులను గురైన నెల్లిమర్ల సీహెచ్‌సీకి తరలించారు. ఈమేరకు వారి ఆరోగ్య పరిస్థితి మెరుగుకావడంతో వైద్యులు బుధవారం మధ్యాహ్నం ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ చేశారు. కాగా విద్యార్థినులను ఎమ్మెల్సీ గాదె శ్రీనివాసులునాయుడు నెల్లిమర్ల పీహెచ్‌సీలో బుధవారం పరామర్శించారు. ఆయన వెంట ఆర్‌జేడీ విజయభాస్కర్, పీఆర్‌టీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి డి. శ్రీనివాసరావు పాల్గొన్నారు. కాగా రాష్ట విద్యామౌలిక వసతుల కార్పోరేషన్ డైరెక్టర్ చీకటి సుహాసిని ఆసుపత్రిని సంద ర్శించి విద్యార్థులతో మాట్లాడారు.
ఫ గుర్ల, అక్టోబరు 29(ఆంధ్రజ్యోతి): గుర్ల కస్తూర్బా పాఠశాలలో మంగళవారం విద్యుత్ షార్ట్ సర్క్యూట్ జరగడంతో ఐదుగురు విద్యార్థులు అస్వస్థతకు గురి కాగా ఆస్పత్రిలో చేర్చారు.ఈ మేరకు బుధవారం ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయి రావడంతో వారిని పలువురు పరామర్శించి, వసతి గృహన్ని కూడా పరిశీలించారు.