Share News

Kalajatha వ్యాధులపై అవగాహనకు కళాజాత

ABN , Publish Date - Jul 21 , 2025 | 11:36 PM

Kalajatha for Awareness on Diseases గిరిజన గ్రామాల్లో ప్రజలకు సీజనల్‌ వ్యాధులపై మరింతగా అవగాహన కల్పించేందుకు కళాజాత బృందాను ఏర్పాటు చేస్తున్నట్లు ఐటీడీఏ ఇన్‌చార్జి పీవో అశుతోష్‌ శ్రీవాత్సవ తెలిపారు. సోమవారం సాయంత్రం పార్వతీపురం ఐటీడీఏ ప్రాంగణంలో ఏర్పాటుచేసిన కళాజాత ప్రదర్శనను తిలకించారు.

Kalajatha    వ్యాధులపై అవగాహనకు కళాజాత
మాట్లాడుతున్న ఐటీడీఏ ఇన్‌చార్జి పీవో

పార్వతీపురం, జూలై 21 (ఆంధ్రజ్యోతి): గిరిజన గ్రామాల్లో ప్రజలకు సీజనల్‌ వ్యాధులపై మరింతగా అవగాహన కల్పించేందుకు కళాజాత బృందాను ఏర్పాటు చేస్తున్నట్లు ఐటీడీఏ ఇన్‌చార్జి పీవో అశుతోష్‌ శ్రీవాత్సవ తెలిపారు. సోమవారం సాయంత్రం పార్వతీపురం ఐటీడీఏ ప్రాంగణంలో ఏర్పాటుచేసిన కళాజాత ప్రదర్శనను తిలకించారు. అనంతరం ఆయన మాట్లా డుతూ.. ‘ప్రస్తుత సీజన్‌లో ఏజెన్సీపై జ్వరాల ప్రభావం ఎక్కువగా ఉంది. ఈ నేపథ్యంలో ముందస్తు జాగ్రత్తలు, అందుబాటులో ఉన్న వైద్య సేవలపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు కళాజాత ఎంతగానో దోహదపడుతుంది. విషజ్వరాలు ప్రబలకుండా కళాజాత ద్వారా విస్తృత ప్రచారం చేయాలి.’ అని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏపీవో పి.మురళీధర్‌, డిప్యూటీ డీఎంహెచ్‌వో పద్మావతి తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Jul 21 , 2025 | 11:36 PM