రెల్లి కులస్థులకు న్యాయం చేయాలి
ABN , Publish Date - Mar 16 , 2025 | 12:07 AM
తమకు న్యాయం చేయా లని కోరుతూ రెల్లి కులస్థులు శనివారం పార్వతీపురం పట్టణంలోని ఇంది రా కాలనీ కూడలిలో గల అంబేడ్కర్ విగ్రహం వద్ద నిరసన చేపట్టారు.
పార్వతీపురంటౌన్, మార్చి 15 (ఆంధ్రజ్యోతి): తమకు న్యాయం చేయా లని కోరుతూ రెల్లి కులస్థులు శనివారం పార్వతీపురం పట్టణంలోని ఇంది రా కాలనీ కూడలిలో గల అంబేడ్కర్ విగ్రహం వద్ద నిరసన చేపట్టారు. జిల్లా రెల్లి కుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్ర మంలో ఆ సంఘ నాయకులు జి.డేనియల్, పి.రాజశేఖర్, ఎస్.గౌరీశంకర్ లు పాల్గొని, మాట్లాడారు. రాష్ట్రంలో 20 లక్షల మంది రెల్లి, ఉపకులాలు జీవిస్తున్నాయని, విద్యా, ఉద్యోగం, ఉపాధి, రాజకీయ రిజర్వేషన్లకు సంబం ధించి 1 శాతం ప్రభుత్వం ప్రకటించడం బాధాకరమన్నారు. రెల్లి కులస్థుల ను మాదిగ కులంలో విలీనం చేయడం గానీ, 5 శాతం రిజర్వేషన్ కల్పిం చడం గానీ చేయాలన్నారు. కార్యక్రమంలో ఆ సంఘ నాయకులు కె.నానా జీ, కె.సుధాకర్, ఎస్.శ్రీకాంత్, జి.శరత్ చైతన్యలు పాల్గొన్నారు.