బాధితులకు న్యాయం చేయాలి
ABN , Publish Date - Sep 07 , 2025 | 12:18 AM
గత కొద్ది రోజులుగా అనారోగ్యంతో బాధపడుతూ.. తగ్గకపోవడంతో రెండు రోజుల కిందట ఆత్మహత్య చేసుకున్న వన్నెపూరి పొట్టిదొర అనే గిరిజనుడి చిత్రపటంతో జిందాల్ నిర్వాసితులు శనివారం బొడ్డవరలో నిరసన చేపట్టారు.
ఎస్.కోట రూరల్, సెప్టెంబరు 6(ఆంధ్రజ్యోతి): గత కొద్ది రోజులుగా అనారోగ్యంతో బాధపడుతూ.. తగ్గకపోవడంతో రెండు రోజుల కిందట ఆత్మహత్య చేసుకున్న వన్నెపూరి పొట్టిదొర అనే గిరిజనుడి చిత్రపటంతో జిందాల్ నిర్వాసితులు శనివారం బొడ్డవరలో నిరసన చేపట్టారు. ఈసందర్భంగా వారు మాట్లాడుతూ 18ఏళ్ల కిందట బొడ్డవర పంచాయతీ అమ్మపాలెంకు చెందిన పొట్టిదొర చక్కగా తన భూమిని సాగుచేసుకుని కుటుంబాన్ని చక్కగా పోషించుకునేవా డని, అయితే జిందాల్ వస్తుందన్న ఆశతో భూములు ఇచ్చాడని, 18 ఏళ్లు అయినా రాకపోవడంతో భూమి కోల్పోయి కూలీగా మారిన పొట్టిదొర అనారోగ్యంతో వైద్యానికి డబ్బులు లేని పరిస్థితిలో ఇలా బలవన్మరణం పొందాడన్నారు. ఏపీ రైతు సంఘ జిల్లా ఉపాధ్యక్షుడు చల్లా జగన్ మాట్లాడుతూ ఈ 18 ఏళ్లలో వందమందికి పైగా నిర్వాసితులు అనారోగ్యంతో, ఇతర కారణాలతో మృతిచెందారని, వీటిపై సర్వే చేయాలని కోరారు. ఇప్పటికైనా ప్రభుత్వం కళ్లు తెరిచి బాధితులకు న్యాయం చేయాలనీ ఆయన డిమాండ్ చేశారు.