Share News

ఫిర్యాదుదారులకు న్యాయం చేయాలి

ABN , Publish Date - Dec 23 , 2025 | 12:31 AM

జిల్లాలోని వివిధ పోలీసు స్టేషన్ల పరిధిలో ఫిర్యాదుదా రుల సమస్యలను చట్ట పరిధిలో పరిష్కరించి న్యాయం చేయాలని ఎస్పీ ఏఆర్‌ దామోదర్‌ ఆదేశించారు.

ఫిర్యాదుదారులకు న్యాయం చేయాలి

విజయనగరం క్రైం, డిసెంబరు 22(ఆంధ్రజ్యోతి): జిల్లాలోని వివిధ పోలీసు స్టేషన్ల పరిధిలో ఫిర్యాదుదా రుల సమస్యలను చట్ట పరిధిలో పరిష్కరించి న్యాయం చేయాలని ఎస్పీ ఏఆర్‌ దామోదర్‌ ఆదేశించారు. సోమవారం జిల్లా పోలీసు కార్యాలయంలో ప్రజా సమస్యల పరిష్కార వేదికకు 27 ఫిర్యాదులు వచ్చాయి. తీసుకున్న ఫిర్యాదుల్లో భూ తగాదాలకు సంబంధించి 11, కుటుంబ కలహాలకు సంబంధించి 3, నగదు వ్యవహారాలకు సంబంధించి 2, మోసాలకు సంబంధించి 1, ఇతర అంశాలకు సంబంధించి 10 ఫిర్యాదులు ఉన్నాయి. సంబంధిత అధికారులు ఫిర్యాదు ల పూర్వాపరాలు విచారణ చేసి, వాస్తవాలు గుర్తించి, చట్ట పరిధిలో చర్యలు చేపట్టాలని ఎస్పీ ఆదేశించారు. స్వీకరించిన పిర్యాదులపై స్పందించి ఏడు రోజుల్లో ఫిర్యాదుదారుల సమస్యలు పరిష్కరించేందుకు చర్యలు తీసుకుని, తీసుకున్న చర్యల వివరాలను నివేదిక రూపంలో పోలీసు కార్యాలయానికి పంపాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఏఎస్‌పీ సౌమ్యలత, సీఐలు ఏవీ లీలారావు, కుమారస్వామి, ఎస్‌ఐలు రాజేష్‌, ప్రభావతి, సిబ్బంది పాల్గొన్నారు.

Updated Date - Dec 23 , 2025 | 12:31 AM