Share News

ఉద్యోగ భద్రత కల్పించాలి

ABN , Publish Date - Jun 24 , 2025 | 12:10 AM

తమకు ఉద్యోగ భద్రత కల్పించాలని కోరుతూ స్థానిక డీసీసీబీ కార్యాల యం వద్ద పీఏసీఎస్‌ సభ్యులు సోమవారం ధర్నా నిర్వహించారు.

ఉద్యోగ భద్రత కల్పించాలి
ధర్నా నిర్వహిస్తున్న పీఏసీఎస్‌ ఉద్యోగులు

  • పీఏసీఎస్‌ ఉద్యోగుల ధర్నా

పార్వతీపురంటౌన్‌, జూన్‌ 23 (ఆంధ్రజ్యోతి): తమకు ఉద్యోగ భద్రత కల్పించాలని కోరుతూ స్థానిక డీసీసీబీ కార్యాల యం వద్ద పీఏసీఎస్‌ సభ్యులు సోమవారం ధర్నా నిర్వహించారు. ఈసందర్భంగా ఆ సంఘ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు ఆర్‌.సత్యం, బి.రాము నాయుడులు మాట్లాడుతూ జిల్లాలోని 34 పీఏసీఎస్‌లో విధులు నిర్వహి స్తున్న 102 మంది సిబ్బంది సమస్యలు పరిష్కరించాలని కోరుతున్నా సంబంధిత అధికారులు పట్టించుకోకపోవడం బాధాకరమన్నారు. వేతన సవరణలు పూర్తి చేసి తమకు కొత్తజీతాలు నిర్ణయించాలని డిమాండ్‌ చేశారు. అనంతరం కలెక్టర్‌ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించారు. ఏఐటీయూసీ జిల్లా కార్యదర్శి ఆర్వీఎస్‌ కుమార్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Jun 24 , 2025 | 12:10 AM