Share News

Job Mela 3న జాబ్‌మేళా

ABN , Publish Date - Aug 29 , 2025 | 11:11 PM

Job Mela on 3rd పార్వతీపురంలో వచ్చే నెల 3న జాబ్‌మేళా నిర్వహిస్తున్నట్టు జిల్లా నైపుణ్యాభివృద్ధి అధికారి కె.సాయికృష్ణచైతన్య శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. పదో తరగతి, ఇంటర్‌, ఐటీఐ ఏదైనా డిగ్రీ చదువుకున్న 18 నుంచి 30 ఏళ్లలోపు వారు అర్హులని పేర్కొన్నారు.

 Job Mela  3న  జాబ్‌మేళా

పార్వతీపురం, ఆగస్టు 29 (ఆంధ్రజ్యోతి): పార్వతీపురంలో వచ్చే నెల 3న జాబ్‌మేళా నిర్వహిస్తున్నట్టు జిల్లా నైపుణ్యాభివృద్ధి అధికారి కె.సాయికృష్ణచైతన్య శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. పదో తరగతి, ఇంటర్‌, ఐటీఐ ఏదైనా డిగ్రీ చదువుకున్న 18 నుంచి 30 ఏళ్లలోపు వారు అర్హులని పేర్కొన్నారు. పది కంపెనీలకు చెందిన ప్రతినిధులు ఇంటర్వ్యూల ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారన్నారు. ఉదయం 9 గంటలకు శ్రీసాయిరామ్‌ డిగ్రీకాలేజ్‌కు రావాలని సూచించారు. ముందుగా అభ్యర్థులు తమ వివరాలను హచ్‌టీటీపీఎస్‌ః//ఎన్‌ఏఐపీయుఎన్‌వైఏఎం. ఏపీ. జీవోవీ.ఇన్‌ వెబ్‌సైట్‌లో నమోదు చేసుకోవాలన్నారు. రిఫరెన్స్‌ నెంబర్‌తో పాటు బయోడేటా, ఆధార్‌ కార్డు, విద్యార్హత సర్టిఫికెట్లు, పాస్‌పోర్టుసైజ్‌ ఫొటోతో హాజరుకావాలన్నారు. మరిన్ని వివరాలకు 91772 97528, 89788 78557 నెంబర్లను సంప్రదించాలన్నారు.

Updated Date - Aug 29 , 2025 | 11:11 PM