Share News

Job Mela 9న పార్వతీపురంలో జాబ్‌మేళా

ABN , Publish Date - Jul 07 , 2025 | 11:57 PM

Job Mela in Parvathipuram on 9th పార్వతీపురంలోని ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలో ఈ నెల 9న జాబ్‌ మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా ఉపాధి కల్పన అధికారి ఆర్‌.వహీదా సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. విశాఖ అచ్యుతాపురం ఫార్మా కంపెనీల్లో 85 పోస్టుల భర్తీకి ఇంటర్వ్యూలు నిర్వహించి అభ్యర్థులను ఎంపిక చేస్తారని పేర్కొన్నారు.

Job Mela  9న పార్వతీపురంలో జాబ్‌మేళా

బెలగాం, జూలై 7(ఆంధ్రజ్యోతి): పార్వతీపురంలోని ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలో ఈ నెల 9న జాబ్‌ మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా ఉపాధి కల్పన అధికారి ఆర్‌.వహీదా సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. విశాఖ అచ్యుతాపురం ఫార్మా కంపెనీల్లో 85 పోస్టుల భర్తీకి ఇంటర్వ్యూలు నిర్వహించి అభ్యర్థులను ఎంపిక చేస్తారని పేర్కొన్నారు. నిరుద్యోగ యువత ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఆసక్తి ఉన్న అభ్యర్థులు డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ. ఎన్‌సీఎస్‌.జీవోవీ.ఇన్‌ వెబ్‌సైట్‌లో ముందుగా తమ వివరాలను నమోదు చేసుకోవాలన్నారు. టెన్త్‌, ఇంటర్‌, ఐటీఐ, బీఎస్సీ పూర్తి చేసిన వారు అర్హులన్నారు. 27 సంవత్సరాల లోపు వారు విద్యార్హత ధ్రువప్రతాలతో హాజరు కావొచ్చని తెలిపారు.

Updated Date - Jul 07 , 2025 | 11:57 PM