Job Mela 29న పాలకొండలో జాబ్‌మేళా
ABN , Publish Date - Dec 23 , 2025 | 11:24 PM
Job Mela in Palakonda on 29th పాలకొండ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఈ నెల 29న జాబ్‌మేళా నిర్వహించనున్నట్టు జిల్లా నైపుణ్యాభివృద్ధి అధికారి కె.సాయికృష్ణచైతన్య మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. టెన్త్, ఇంటర్, ఐటీఐ, ఏదైనా డిగ్రీ పాసైన వారు, 18 నుంచి 28 సంవత్సరాల లోపు నిరుద్యోగ యువతీ యువకులు ఈ జాబ్‌మేళాలో పాల్గొనొచ్చన్నారు.
పార్వతీపురం, డిసెంబరు 23 (ఆంధ్రజ్యోతి): పాలకొండ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఈ నెల 29న జాబ్‌మేళా నిర్వహించనున్నట్టు జిల్లా నైపుణ్యాభివృద్ధి అధికారి కె.సాయికృష్ణచైతన్య మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. టెన్త్, ఇంటర్, ఐటీఐ, ఏదైనా డిగ్రీ పాసైన వారు, 18 నుంచి 28 సంవత్సరాల లోపు నిరుద్యోగ యువతీ యువకులు ఈ జాబ్‌మేళాలో పాల్గొనొచ్చన్నారు. పది కంపెనీలకు చెందిన ప్రతినిధులు ఇంటర్వ్యూలను నిర్వహించి ఉద్యోగాలకు అభ్యర్థులను ఎంపిక చేస్తారని పేర్కొన్నారు. కాగా అభ్యర్థులు ముందుగా హెచ్‌టీటీపీఎస్. ఎన్‌ఏఐపీయూ ఎన్‌వైఏఎం.ఏపీ.జీవోవీ.ఇన్ వెబ్‌సైట్‌లో తప్పనిసరిగా నమోదు చేసుకోవాలన్నారు. రిఫరెన్స్ నెంబర్‌తో పాటు బయోడేటా, ఆధార్‌కార్డు, విద్యార్హత సర్టిఫికెట్లు, ఒరిజనల్, జిరాక్స్, ఒక పాస్‌పోర్టుసైజ్ ఫొటోతో జాబ్‌మేళాకు హాజరుకావాలని సూచించారు. మరిన్ని వివరాలకు 63012 75511, 79937 95796 నెంబర్లకు సంప్రదించాలన్నారు.