Share News

Job Mela at Seethampeta on 11th 11న సీతంపేటలో జాబ్‌మేళా

ABN , Publish Date - Jun 10 , 2025 | 12:47 AM

Job Mela at Seethampeta on 11th సీతంపేట వైటీసీలో ఈనెల 11న జాబ్‌మేళా నిర్వహించనున్నట్లు ఐటీడీఏ ఇన్‌చార్జి పీవో సి.యశ్వంత్‌కుమార్‌రెడ్డి సోమవారం ఓ ప్రకటనలో తెలిపారు. టెన్త్‌, ఇంటర్‌, ఐటీఐ, ఏదైనా డిగ్రీ పాసైన గిరిజన నిరుద్యోగులు జాబ్‌మేళాకు హాజరుకావొచ్చని పేర్కొన్నారు.

Job Mela at Seethampeta on 11th  11న  సీతంపేటలో  జాబ్‌మేళా

సీతంపేట రూరల్‌,జూన్‌ 9(ఆంధ్రజ్యోతి): సీతంపేట వైటీసీలో ఈనెల 11న జాబ్‌మేళా నిర్వహించనున్నట్లు ఐటీడీఏ ఇన్‌చార్జి పీవో సి.యశ్వంత్‌కుమార్‌రెడ్డి సోమవారం ఓ ప్రకటనలో తెలిపారు. టెన్త్‌, ఇంటర్‌, ఐటీఐ, ఏదైనా డిగ్రీ పాసైన గిరిజన నిరుద్యోగులు జాబ్‌మేళాకు హాజరుకావొచ్చని పేర్కొన్నారు. మొత్తంగా 12 కంపెనీలకు చెందిన ప్రతినిధులు ఇంటర్వ్యూలు నిర్వహించి ఉద్యోగాలకు అభ్యర్థులను ఎంపిక చేస్తారన్నారు. ఆసక్తి కలిగిన వారు ముందస్తుగా తమ వివరాలను వెబ్‌సైట్‌లో నమోదు చేసుకోవాలని సూచించారు. రిఫరెన్స్‌ నెంబర్‌తో పాటు ఆధార్‌కార్డు, ఒరిజినల్‌ విద్యార్హత సర్టిఫికెట్లు, పాస్‌పోర్ట్‌ సైజు ఫొటోతో వైటీసీకి హాజరుకావల్సి ఉంటుందని చెప్పారు. ఇతర వివరాల కోసం ఈ 63012 75511, 79937 95796 నెంబర్లను సంప్రదించాలన్నారు.

Updated Date - Jun 10 , 2025 | 12:47 AM