Share News

Job Mela 25న కురుపాంలో జాబ్‌మేళా

ABN , Publish Date - Jul 19 , 2025 | 11:13 PM

Job Mela at Kurupam on 25th కురుపాంలో ఈ నెల 25న జాబ్‌మేళా నిర్వహించనున్నట్లు జిల్లా నైపుణ్యాభివృద్ధి అధికారి కె.సాయి కృష్ణచైతన్య శనివారం ఓ ప్రకటనలో తెలిపారు. స్థానిక డిగ్రీ కళాశాల ఆవరణలో నిర్వహించనున్న జాబ్‌మేళాకు 11 కంపెనీల ప్రతినిధులు హాజరు కానున్నారని వెల్లడించారు.

Job Mela   25న కురుపాంలో జాబ్‌మేళా

కురుపాం,జూలై19(ఆంధ్రజ్యోతి): కురుపాంలో ఈ నెల 25న జాబ్‌మేళా నిర్వహించనున్నట్లు జిల్లా నైపుణ్యాభివృద్ధి అధికారి కె.సాయి కృష్ణచైతన్య శనివారం ఓ ప్రకటనలో తెలిపారు. స్థానిక డిగ్రీ కళాశాల ఆవరణలో నిర్వహించనున్న జాబ్‌మేళాకు 11 కంపెనీల ప్రతినిధులు హాజరు కానున్నారని వెల్లడించారు. అభ్యర్థులకు ఇంటర్వ్యూలు నిర్వహించి ఉద్యోగాలకు ఎంపిక చేస్తారని పేర్కొన్నారు. టెన్త్‌, ఇంటర్‌, డిగ్రీ, ఐటీఐ, ఏదైన డిగ్రీ పాసైన విద్యార్థులు అర్హులన్నారు. విద్యార్హత ధ్రువపత్రాలతో హాజరు కావాలని సూచించారు.

Updated Date - Jul 19 , 2025 | 11:13 PM