Share News

జిందాల్‌ అక్రమాలపై విచారణ చేపట్టాలి

ABN , Publish Date - Nov 24 , 2025 | 11:42 PM

జిందాల్‌భూసేకరణలో జరిగిన అక్రమాలపై ముఖ్యమంత్రి స్పందించి న్యాయ విచారణ జరి పించాలని ఎమ్మెల్సీ ఇందుకూరిరఘురాజు కోరా రు. సోమవారం బొడ్డవరలో ఆయన విలేకరు లతో మాట్లాడుతూ జిందాల్‌ నిర్వాసితులు ఎలా మోసపోయామో నిరసన దీక్షల ద్వారా తెలుసు కున్నారని, ఇన్నాళ్లు జిందాల్‌ ముసుగు వేసి భూములను ఏవిధంగా దోచుకున్నారో తెలుసు కున్నారన్నారు.

జిందాల్‌ అక్రమాలపై విచారణ చేపట్టాలి
ముఖ్యమంత్రికి రాసిన లేఖ చూపిస్తున్న ఇందుకూరి రఘురాజు :

ఎస్‌.కోట రూరల్‌, నవంబరు 24(ఆంధ్రజ్యో తి):జిందాల్‌భూసేకరణలో జరిగిన అక్రమాలపై ముఖ్యమంత్రి స్పందించి న్యాయ విచారణ జరి పించాలని ఎమ్మెల్సీ ఇందుకూరిరఘురాజు కోరా రు. సోమవారం బొడ్డవరలో ఆయన విలేకరు లతో మాట్లాడుతూ జిందాల్‌ నిర్వాసితులు ఎలా మోసపోయామో నిరసన దీక్షల ద్వారా తెలుసు కున్నారని, ఇన్నాళ్లు జిందాల్‌ ముసుగు వేసి భూములను ఏవిధంగా దోచుకున్నారో తెలుసు కున్నారన్నారు. వీరు బయటపెట్టిన అక్రమాలపై ముఖ్యమంత్రికి లేఖ రాశానని, వెంటనేకలెక్టర్‌తో ఇక్కడ క్షేత్రస్థాయిలో విచారణ జరిపితే అవినీతి వెలుగులోకి వస్తుందని తెలిపారు. తాము పరిశ్ర మలకు ఎప్పుడు వ్యతిరేకంగా లేమని, కేవలం భూమి కోల్పోయిన బాధితులకు న్యాయం చేయాలని కోరుతున్నామని చెప్పారు. ప్రభుత్వం స్పందించి న్యాయంచేస్తే స్వాగతిస్తామని, లేదంటే నమ్ముకున్న న్యాయదేవత తమను గెలిపిస్తుందని తెలిపారు.

విచారణ నిర్వహించి శిక్షించాలి

జిందాల్‌ భూసేకరణలో కొంతమంది బినామీలు రెవెన్యూ అధికారులు, సిబ్బందితో కుమ్మకై కోట్లు రూపాయిలు కాజేశారని వారిపై విచారణ జరిపి చట్టపరంగా కఠినంగా శిక్షించాలని జిందాల్‌ నిర్వాసితులు కోరారు. బొడ్డవరలో 163వ రోజు నిరసన దీక్షలో భాగంగా వారు మాట్లాడుతూ జిందాల్‌ హరిజన, గిరిజనులకు మోసంచేసిందన్నారు.

Updated Date - Nov 24 , 2025 | 11:43 PM