జిందాల్ నిర్వాసితులపై నిర్లక్ష్యం తగదు
ABN , Publish Date - Oct 19 , 2025 | 11:58 PM
శృంగవరపుకోట మండలంలోని జిందాల్ భూనిర్వాసితుల సమస్యపై ప్రభుత్వం నిర్లక్ష్యం వహించడం తగదని ఏపీ రైతు సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు చల్లా జగన్ ఆవేదన వ్యక్తం చేశారు.
వేపాడ, అక్టోబరు 19(ఆంధ్రజ్యోతి): శృంగవరపుకోట మండలంలోని జిందాల్ భూనిర్వాసితుల సమస్యపై ప్రభుత్వం నిర్లక్ష్యం వహించడం తగదని ఏపీ రైతు సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు చల్లా జగన్ ఆవేదన వ్యక్తం చేశారు. ఆదివారం ఆయన వేపాడలో మండల గిరిజన నాయకులతో కలిసి ఆందోళన చేపట్టారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఎస్.కోట మండలం బొడ్డవర ప్రాంతంలో అల్యూమినియం ఫ్యాక్టరీ వస్తే తమ బతుకులు మారుతాయని ఆ ప్రాంతం చుట్టూ ఉన్న ఐదు పంచాయతీల దళిత, గిరిజన ప్రజలు వారికి ఉన్న కొద్దో గొప్పో భూములను జిందాల్ యాజమాన్యానికి ఇవ్వగా, ఆ కంపెనీ యాజమాన్యం వారిని మోసం చేసిందన్నారు. ఇన్ని రోజులుగా వారు పోరాటం సాగిస్తున్నా ప్రభుత్వం జిందాల్ పక్కన నిలబడడం దారుణమన్నారు. మారిక గిరిజనులు, మండల గిరిజన నాయకులు పాల్గొన్నారు.