జిందాల్ నిర్వాసితుల నిరసన
ABN , Publish Date - Oct 10 , 2025 | 12:40 AM
:జిందాల్ యాజమాన్యం తమకు న్యాయం చేయాలని 111రోజులుగా పోరాటం చేస్తున్న ఏఒక్కరు స్పందించడం లేదని, ఈ విషయంపై మాజీ ముఖ్యమంత్రి జగన్ కల్పించుకోని న్యాయం చేయాలని జిందాల్ నిర్వాసితులు కోరారు.
ఎస్.కోట రూరల్,అక్టోబరు 9(ఆంధ్రజ్యోతి):జిందాల్ యాజమాన్యం తమకు న్యాయం చేయాలని 111రోజులుగా పోరాటం చేస్తున్న ఏఒక్కరు స్పందించడం లేదని, ఈ విషయంపై మాజీ ముఖ్యమంత్రి జగన్ కల్పించుకోని న్యాయం చేయాలని జిందాల్ నిర్వాసితులు కోరారు. గురువారం బొడ్డవరలో నిర్వహించిన రిలేదీక్ష శిబిరంలో వారు మాట్లాడుతూ అప్పటి సీఎం రాజశేఖరరెడ్డి మాట నమ్మి భూములిస్తే సదరు పరిశ్రయ యాజమాన్యం కంపెనీ ఏర్పాటుచేయకుండా నిలువున ముంచిందని వాపోయారు.