జిందాల్ నిర్వాసితుల నిరసన
ABN , Publish Date - Sep 16 , 2025 | 11:53 PM
జిందాల్ పరిశ్రమకు తమ భూములు ఇచ్చి 18 ఏళ్లు అయినా పరిశ్రమ రాలేదని.. అప్పటి నుంచి పరిశ్రమ యాజమాన్యం తమకు ఎంత డబ్బు ఇచ్చిందో అంతా తిరిగి ఇచ్చేస్తామని.. తమ భూములు తమకు వెనక్కి ఇవ్వాలని జిందాల్ నిర్వాసితులు కోరారు.
ఎస్.కోట రూరల్, సెప్టెంబరు 16(ఆంధ్రజ్యోతి): జిందాల్ పరిశ్రమకు తమ భూములు ఇచ్చి 18 ఏళ్లు అయినా పరిశ్రమ రాలేదని.. అప్పటి నుంచి పరిశ్రమ యాజమాన్యం తమకు ఎంత డబ్బు ఇచ్చిందో అంతా తిరిగి ఇచ్చేస్తామని.. తమ భూములు తమకు వెనక్కి ఇవ్వాలని జిందాల్ నిర్వాసితులు కోరారు. ఈ మేరకు మంగళవారం బొడ్డవర గ్రామం వద్ద నిరసన నిర్వహించారు.
ఫిర్యాదుపై 19న విచారణ
జిందాల్ నిర్వాసితులు జాతీయ ఎస్టీ కమిషన్‌కు గతంలో చేసిన ఫిర్యాదుపై ఈనెల 19న హైదరాబాద్‌లో విచారణ నిర్వహిస్తు న్నట్టు స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఇందుకూరి రఘురాజు తెలిపారు. మంగళవారం బొడ్డవర గ్రామంలో ఆయన విలేకర్లతో మాట్లాడారు. జిందాల్ నిర్వాసితుల సమస్యపై తాను గత నెలలో జాతీయ ఎస్టీ, ఎస్సీ కమిషన్‌ను ఆశ్రయించానని, ఈనెల 10వ తేదీన నిర్వాసితులు స్వయంగా వెళ్లి కలిశారని ఆయన చెప్పారు. ఈసందర్భంగా ఈ అంశంపై నిగ్గు తేల్చేందుకు జాతీయ ఎస్టీ కమిషన్ 19న విచారణ చేపట్టనున్నదని ఆయన తెలిపారు. ఈ విచారణకు తనతోపాటు నిర్వాసితులు రావాలని కోరారు. అదేవిధంగా రాష్ట్ర ప్రిన్సిపాల్ కార్యదర్శితో పాటు జిల్లా కలెక్టర్ హాజరవుతారని ఆయన తెలిపారు.