జిందాల్ నిర్వాసితుల ధర్నా
ABN , Publish Date - Jul 12 , 2025 | 12:00 AM
జిందాల్ యాజమా న్యం నుంచి తమకు రావాల్సిన పరిహారం ఇప్పించాలని ఆ కంపెనీ నిర్వాసితులు శుక్రవారం బొడ్డవర గ్రామంలో ధర్నా చేశారు.
శృంగవరపుకోట రూరల్, జూలై 11(ఆంధ్ర జ్యోతి): జిందాల్ యాజమా న్యం నుంచి తమకు రావాల్సిన పరిహారం ఇప్పించాలని ఆ కంపెనీ నిర్వాసితులు శుక్రవారం బొడ్డవర గ్రామంలో ధర్నా చేశారు. జిల్లా రైతు సంఘం ఉపాధ్యక్షు డు చల్లా జగన్ ఆధ్వర్యంలో నల్లజెండాల తో నినాదాలు చేశారు. మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ తమ సమస్యపై స్పందించి ప్రభుత్వంతో మాట్లాడాలని వారు కోరారు. అలాగే ఎమ్మెల్యే కూడా తమ సమస్య పై దృష్టి సారించాలని కోరారు.