Share News

మానవ హక్కుల కమిషన్‌కు జిందాల్‌ నిర్వాసితుల లేఖలు

ABN , Publish Date - Jul 10 , 2025 | 12:15 AM

తమకు జిందాల్‌ కంపెనీ నుంచి రావాల్సిన హక్కులను కల్పించాలని కోరుతూ నిర్వాసితులు బుధవారం జాతీయ మానవ హక్కుల కమిషన్‌కు సామూహికంగా లేఖలు రాశారు.

మానవ హక్కుల కమిషన్‌కు జిందాల్‌ నిర్వాసితుల లేఖలు
జాతీయ మానవ హక్కుల కమిషన్‌కు లేఖలు రాసి చూపిస్తున్న జిందాల్‌ నిర్వాసితులు

శృంగవరపుకోట రూరల్‌, జూలై 9(ఆంధ్రజ్యోతి): తమకు జిందాల్‌ కంపెనీ నుంచి రావాల్సిన హక్కులను కల్పించాలని కోరుతూ నిర్వాసితులు బుధవారం జాతీయ మానవ హక్కుల కమిషన్‌కు సామూహికంగా లేఖలు రాశారు. ఈ విషయమై జిందాల్‌ నిర్వాసితులు మట్లాడుతూ ఇప్పటి వరకు తమ గోడును మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎస్‌సీ, ఎస్‌టీ కమిషన్‌ దృష్టిలో పెట్టినా ఫలితం లేకపోయిందన్నారు. అందుకే మానవ హక్కుల కమిషన్‌కు లేఖలు రాస్తున్నట్టు తెలిపారు.

Updated Date - Jul 10 , 2025 | 12:17 AM