రిలే దీక్షలో జిందాల్ నిర్వాసితులు
ABN , Publish Date - Oct 24 , 2025 | 12:10 AM
మండలంలోని రైతుల నుంచి జిందాల్ పరిశ్రమ కోసం సేకరించిన భూములను గత ప్రభుత్వంలో కొందరు ప్రజాప్రతినిధులు, పలు ముఖ్య శాఖల అధికారుల ఆధ్వర్యంలో భూములు అమ్మకాలు చేశారని జిందాల్ నిర్వాసితులు ఆరోపించా రు.
ఎస్.కోట రూరల్, అక్టోబరు 23(ఆంధ్రజ్యోతి): మండలంలోని రైతుల నుంచి జిందాల్ పరిశ్రమ కోసం సేకరించిన భూములను గత ప్రభుత్వంలో కొందరు ప్రజాప్రతినిధులు, పలు ముఖ్య శాఖల అధికారుల ఆధ్వర్యంలో భూములు అమ్మకాలు చేశారని జిందాల్ నిర్వాసితులు ఆరోపించా రు. గురువారం బొడ్డవరలో తమ 125 రోజు నిరసనలో భాగంగా వారు మాట్లాడారు. ఈ భూముల అమ్మకాలకు సంబంధించి తమ వద్ద పూర్తి ఆధారాలు ఉన్నాయని, వీటిపై గతంలో జిల్లా గ్రీవెన్స్‌లో ఫిర్యాదు చేస్తే వాటిని తొక్కి పెట్టారన్నారు. దీనిపై ప్రభుత్వం విచారణ జరిపించాలని కోరారు.