జిందాల్ అంశాన్ని చర్చించాలి
ABN , Publish Date - Sep 20 , 2025 | 12:14 AM
జిందాల్ నిర్వాసితుల సమస్యపై అసెంబ్లీ సమావేశాల్లో చర్చించాలని వారు కోరారు.
ఎస్.కోట రూరల్, సెప్టెంబరు 19(ఆంధ్రజ్యోతి): జిందాల్ నిర్వాసితుల సమస్యపై అసెంబ్లీ సమావేశాల్లో చర్చించాలని వారు కోరారు. శుక్రవారం బొడ్డవర గ్రామంలో ఏపీ రైతు సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు చల్లా జగన్ ఆధ్వర్యంలో తమ నిరసనను కొనసాగించారు. నల్లజెండాలు పట్టుకుని తమకు న్యాయం కావాలని డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రి తమ సమస్య పరిష్కరించాలని వేడుకున్నారు.