Mahishasura Mardini జయ జయహే.. మహిషాసురమర్దిని
ABN , Publish Date - Oct 02 , 2025 | 12:03 AM
Jaya Jaya He… Mahishasura Mardini ఉత్తరాంధ్రుల ఆరాధ్యదైవం పాలకొండ కోటదుర్గమ్మ బుధవారం మహిషాసురమర్దినిగా భక్తులకు దర్శనమిచ్చింది. శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా తెల్లవారుజాము నుంచే ప్రధాన అర్చకుడు డి.లక్ష్మీ ప్రసాదశర్మ ఆధ్వర్యంలో అమ్మవారికి విశేష పూజలు, అర్చనలు చేశారు. పరిసర ప్రాంతాలకు చెందిన భక్తులు పెద్దఎత్తున తరలివచ్చి కోటదుర్గమ్మను దర్శించుకున్నారు.
పాలకొండ, అక్టోబరు 1 (ఆంధ్రజ్యోతి): ఉత్తరాంధ్రుల ఆరాధ్యదైవం పాలకొండ కోటదుర్గమ్మ బుధవారం మహిషాసురమర్దినిగా భక్తులకు దర్శనమిచ్చింది. శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా తెల్లవారుజాము నుంచే ప్రధాన అర్చకుడు డి.లక్ష్మీ ప్రసాదశర్మ ఆధ్వర్యంలో అమ్మవారికి విశేష పూజలు, అర్చనలు చేశారు. పరిసర ప్రాంతాలకు చెందిన భక్తులు పెద్దఎత్తున తరలివచ్చి కోటదుర్గమ్మను దర్శించుకున్నారు. అనంతరం తీర్థ ప్రసాదాలు స్వీకరించి.. మొక్కులు చెల్లించు కున్నారు. మహిళా భక్తులు ఆలయ ప్రాంగణంలో సామూహిక కుంకుమ పూజలు చేశారు. ఆలయ ఈవో వీవీ సూర్యనారాయణ భక్తులకు అసౌకర్యం కలగకుండా చర్యలు తీసుకున్నారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు బందోబస్తు నిర్వహించారు.