Share News

ప్రజల దృష్టి మళ్లించడానికి జగన్‌ ప్లాన్‌

ABN , Publish Date - Oct 22 , 2025 | 11:51 PM

వైసీపీ హయాంలో ఐదేళ్ల లిక్కరు మాఫియా నడిపి రూ.3500 కోట్లు దోచుకున్న విషయంపై ప్రజల దృష్టి మళ్లించడానికి జగన్‌ కుట్రలకు ప్లాన్‌ చేశారని మార్క్‌ఫెడ్‌ చైర్మన్‌, టీడీపీ నెల్లిమర్ల నియోజకవర్గ ఇన్‌చార్జి కర్రోతుబంగార్రాజు ఆరోపించారు.

ప్రజల దృష్టి మళ్లించడానికి జగన్‌ ప్లాన్‌
మాట్లాడుతున్న కర్రోతు బంగార్రాజు :

భోగాపురం, అక్టోబరు22(ఆంధ్రజ్యోతి): వైసీపీ హయాంలో ఐదేళ్ల లిక్కరు మాఫియా నడిపి రూ.3500 కోట్లు దోచుకున్న విషయంపై ప్రజల దృష్టి మళ్లించడానికి జగన్‌ కుట్రలకు ప్లాన్‌ చేశారని మార్క్‌ఫెడ్‌ చైర్మన్‌, టీడీపీ నెల్లిమర్ల నియోజకవర్గ ఇన్‌చార్జి కర్రోతుబంగార్రాజు ఆరోపించారు. బుధవారం భోగాపురంలో విలేకరులతో మాట్లాడు తూ కూటమి ప్రభుత్వ ప్రతిష్టను దెబ్బతీయాలన్న ఉద్దేశంతోనే కుట్రపూరితంగా కల్తీ మద్యం ఫార్ములాను తాడేపల్లి ప్యాలెస్‌లో తయారు చేశారన్నారు. గత ప్రభుత్వంలో మద్యం తయారీ కంపెనీలన్నింటిని జగన్‌ గుప్పిట్లో పెట్టుకొని జే బ్రాడ్లు మాత్రమే తయారు చేసి దీని ద్వారా రాష్ట్రంలో 30వేల మంది ప్రాణాలు కోల్పాయారని మరో 30 లక్షల మంది అనారోగ్య పాలయ్యారన్నారు. నాణ్యమైన మద్యం తెలుసుకోవడానికి ప్రభు త్వం సురక్షయాప్‌ తీసుకొచ్చిందన్నారు. యాప్‌కు సంబందించి ఈనెల 29వ తేదీ వరకు అందరికి అవగాహన కల్పిస్తామని తెలిపారు.అనంతరం గంగిరావి చెరువు సమీపంలో ఉన్న మద్యం దుకాణానికి వెళ్లి అక్కడ సురక్ష యాప్‌పై అవగాహన కలిగించారు. కార్య క్రమంలో టీడీపీ మండలాధ్యక్షుడు కర్రోతు సత్యనారాయణ, పిడుగు తోటారావు, దాసరి అప్పలస్వామి, తాతారావు, బొడ్డహరి పాల్గొన్నారు.

Updated Date - Oct 22 , 2025 | 11:51 PM