Share News

తుఫాన్‌పై జగన్‌ వ్యాఖ్యలు తగదు

ABN , Publish Date - Nov 02 , 2025 | 11:58 PM

సీఎం చంద్రబాబు వల్లే మొంథా తుఫాన్‌ వచ్చిందనడం వైసీ పీ అధినేత జగన్మోహన్‌రెడ్డిని అజ్ఞానా నికి నిదర్శనమని, అటువంటి వ్యాఖ్య లు తగవని శృంగవరపుకోట ఎమ్మెల్యే లలితకుమారి హితవుపలికారు. ఆది వారం లక్కవరపుకోటలో ఆమె విలేక రులతో మాట్లాడుతూ జగన్‌ను చూసి రాబంధులు కూడా సిగ్గుపడుతున్నాయన్నారు.

   తుఫాన్‌పై జగన్‌ వ్యాఖ్యలు తగదు
మాట్లాడుతున్న లలితకుమారి :

లక్కవరపుకోట, నవంబరు 2(ఆం ధ్రజ్యోతి): సీఎం చంద్రబాబు వల్లే మొంథా తుఫాన్‌ వచ్చిందనడం వైసీ పీ అధినేత జగన్మోహన్‌రెడ్డిని అజ్ఞానా నికి నిదర్శనమని, అటువంటి వ్యాఖ్య లు తగవని శృంగవరపుకోట ఎమ్మెల్యే లలితకుమారి హితవుపలికారు. ఆది వారం లక్కవరపుకోటలో ఆమె విలేక రులతో మాట్లాడుతూ జగన్‌ను చూసి రాబంధులు కూడా సిగ్గుపడుతున్నాయన్నారు. తుఫాన్‌లో శవ రాజకీయాలు చేయ డానికి శవాలు దొరక్కపోవడంతో ఏమి చేయాలో పాలుపోవడం లేదన్నారు. జగన్‌ తండ్రి శవాన్నే అడ్డుపెట్టుకుని రాజకీయాల్లోకి వచ్చి బాబాయ్‌ను చంపి మరింత శవరాజకీయాలకు పదును పెట్టాడని విమర్శించారు. కాశీబుగ్గ ఘటనలో ప్రభుత్వం ఒక్కో మృతుని కుటుంబానికి రూ.17లక్షలు, గాయపడిన వారికి రూ.3.5 లక్షలు కేటాయించి న్యాయం చేసిందన్నారు. మద్యం దొంగలు ఒక్కక్కరూ దొరు కుతున్నా రని అంతిమ దొంగ చాలాపెద్దవాడిని త్వరలోనే పెద్దదొంగ దొరికిపోతాడని చెప్పారు. కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్‌ చొక్కాకుల మల్లునాయుడు, కొట్యాడ రమణమూర్తి, జి.దేముడు, ఎం.వాసు, సత్తిబాబు పాల్గొన్నారు.

Updated Date - Nov 02 , 2025 | 11:58 PM