Share News

జగన్‌ తీరుమార్చుకోవాలి

ABN , Publish Date - Jun 07 , 2025 | 12:15 AM

మాజీ సీఎం జగన్‌ తీరుమార్చుకోవా లని మంత్రి గుమ్మిడి సంధ్యారాణి హితవుపలికారు. రాష్ట్రంలో గంజాయి తర లిస్తూ పలుసార్లు పట్టుబడిన మూకలను పరామర్శిస్తే వారిని ప్రోత్సహించి నట్లు కాదా అని ప్రశ్నించారు.

 జగన్‌ తీరుమార్చుకోవాలి
మాట్లాడుతున్న సంధ్యారాణి :

సాలూరు, జూన్‌ 6(ఆంధ్రజ్యోతి): మాజీ సీఎం జగన్‌ తీరుమార్చుకోవా లని మంత్రి గుమ్మిడి సంధ్యారాణి హితవుపలికారు. రాష్ట్రంలో గంజాయి తర లిస్తూ పలుసార్లు పట్టుబడిన మూకలను పరామర్శిస్తే వారిని ప్రోత్సహించి నట్లు కాదా అని ప్రశ్నించారు. శుక్రవారం సాలూరులో విలేకరులతో మా ట్లాడుతూ జగన్‌రెడ్డి మానసిక స్థితి ఏంటో ప్రజలు ఈ దశలో బాగా అర్థం చేసుకోవాలన్నారు.సంఘ విద్రోహ చర్యలకు పాల్పడుతూ పోలీసులపై విమ ర్శలు చేస్తావా అని జగన్‌ను ప్రశ్నించారు. హత్యలు, అత్యాచారాలు, అత్యంత తీవ్రమైన నేరాల విషయంలో పోలీసులు చర్యలు తీసుకుంటే తప్పేంటని నిలదీశారు. అసలైన వెన్నుపోటుదారుడు జగనేనన్నారు. ఐదు సంవత్సరాల పాటుప్రజలు పరిపాలనాబాధ్యత ఇచ్చానరని, ఆ స్థానం దుర్వినియోగం చేసి ఎన్నో అకృత్యాలకు పాల్పడి మళ్లీ తప్పుడుఆరోపణలతో రాజకీయ ప్రయోజనం పొందాలని చూస్తే ప్రజలు మాత్రం మళ్లీ మోసపోరన్నారు. ప్రజలపైనా నిత్యం కడుపుమంటతో ఉన్న వ్యక్తి జగన్‌రెడ్డి అని అన్నారు. సమావేశంలో టీడీపీ పట్టణాధ్యక్షుడు నిమ్మాది తిరుతిపరావు, గుళ్ల వేణుగోపాలనాయుడు, యుగంధర్‌, ఆముదాల పరమేశ్‌, ముఖీ సూర్యనారాయణ పాల్గొన్నారు.

Updated Date - Jun 07 , 2025 | 12:15 AM