Share News

జగనే అసలైన వెన్నుపోటుదారుడు

ABN , Publish Date - Jun 04 , 2025 | 12:04 AM

మాజీ సీఎం అసలైన వెన్నపోటుదాడురుడని, వెన్నుపోటు పేరుతో ధర్నా చేయడం దొంగే దొంగ అన్నట్టు ఉందని మంత్రి గుమ్మడి సంధ్యారాణి పేర్కొన్నారు.గతఏడాది జూన్‌ నాలుగో తేదీన రాష్ట్రంలో సైకో జగన్‌ పాలన పోయి మళ్లీ చంద్రన్న పాలన వచ్చి ప్రజాస్వామ్యం రాష్ట్రంలో మళ్లీ ప్రాణం పోసుకుం దన్నారు.

  జగనే అసలైన వెన్నుపోటుదారుడు
మాట్లాడుతున్న సంధ్యారాణి:

సాలూరు, జూన్‌ 3(ఆంధ్రజ్యోతి): మాజీ సీఎం అసలైన వెన్నపోటుదాడురుడని, వెన్నుపోటు పేరుతో ధర్నా చేయడం దొంగే దొంగ అన్నట్టు ఉందని మంత్రి గుమ్మడి సంధ్యారాణి పేర్కొన్నారు.గతఏడాది జూన్‌ నాలుగో తేదీన రాష్ట్రంలో సైకో జగన్‌ పాలన పోయి మళ్లీ చంద్రన్న పాలన వచ్చి ప్రజాస్వామ్యం రాష్ట్రంలో మళ్లీ ప్రాణం పోసుకుం దన్నారు.శనివారం సాలూరులో విలేకరులతో మాట్లాడుతూ ప్రజలిచ్చిన తీర్పు వెన్ను పోటు అంటారా, ప్రజలనే అవమానిస్తారాఅని ప్రశ్నించారు.వెన్నుపోటు, గొడ్డలి వేటుకు పేటెంట్‌ హక్కులన్ని జగన్మోహన్‌రెడ్డివే అన్నారు. కుంభకోణాల నుంచి ప్రజల దృష్టి మళ్లించడనికి ధర్నాల డ్రామాను జగన్‌ ముఠా ఆడుతోందన్నారు. జగన్‌ ప్రభుత్వం తొలి ఏడాదిలో కనీసం 10హామీలను కూడా అమలుచేయలేదని తెలిపారు. ఏ ప్రభుత్వ మూ అమలు చేయని విధంగా కూటమి ప్రభుత్వం తొలి ఏడాదిలోనే 70 శాతం హామీలను అమలుచేసిందన్నారు.ఐదేళ్లలో85శాతం హామీలను జగన్‌ప్రభుత్వం ఎగనామం పెట్టింద న్నారు. ఆస్తికోసం తల్లి, చెల్లిని ఇంటి నుంచి గెంటేసి కుటుంబ వ్యవస్థకే వెన్నుపోటు పొడిచారన్నారు. ఐదేళ్ల పాలనలో 85 శాతం హామీలకు ఎగనామంపెట్టి వెన్నుపోటు పోడిచారన్నారు. మద్యపాన నిషేధంపై మట తిప్పి,మడమతిప్పి, విషపూరిత మద్యం పోసి పేదలఆరోగ్యానికి వెన్నుపోటు పొడిచారన్నారు. మెగా డీఎస్సీ హామీపై మాట తప్పారన్నారు. గిరిజన సంక్షేమానికి ఈ ఏడాది రూ.1300 కోట్లు కేటాయించామని తెలి పారు.దీపం-2కింద మూడు సిలెండర్లు ఉచితంగాఇస్తున్నామన్నారు. 2025-26 బడ్జెట్‌లో బీసీల కోసం 47,456 కోట్లు కేటాయించామన్నారు. కార్యక్రమంలో టీడీపీ పట్టణాధ్యక్షు డు తిరుపతిరావు, ఏఎంసీచైర్మన్‌ ముఖీసూర్యనారాయణ,టీడీపీ మండలాధ్యక్షుడు ఆముదాల పరమేశ్‌, కౌన్సిలర్‌ హర్షవర్దన్‌, కూనిశెట్టి భీమారావు పాల్గొన్నారు.

Updated Date - Jun 04 , 2025 | 12:04 AM