Share News

I've been cycling to school for 30 years. 30 ఏళ్లుగా సైకిల్‌పైనే బడికి..

ABN , Publish Date - Jun 03 , 2025 | 12:07 AM

I've been cycling to school for 30 years.ఆయన ప్రధానోపాధ్యాయుడు. పేరు పేరు కొట్రా కృష్ణదాస్‌. 1995లో టీచర్‌గా విధుల్లో చేరారు. బొబ్బిలి మండలం అలజంగి ప్రభుత్వ సీబీఎం పాఠశాలలో ప్రధాన ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నారు. ఎయిడెడ్‌ స్కూల్‌ కావడంతో సుదీర్ఘకాలంగా ఒకే పాఠశాలలో పనిచేస్తున్నారు.

I've been cycling to school for 30 years. 30 ఏళ్లుగా సైకిల్‌పైనే బడికి..

30 ఏళ్లుగా సైకిల్‌పైనే బడికి..

ఆయన ప్రధానోపాధ్యాయుడు. పేరు పేరు కొట్రా కృష్ణదాస్‌. 1995లో టీచర్‌గా విధుల్లో చేరారు. బొబ్బిలి మండలం అలజంగి ప్రభుత్వ సీబీఎం పాఠశాలలో ప్రధాన ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నారు. ఎయిడెడ్‌ స్కూల్‌ కావడంతో సుదీర్ఘకాలంగా ఒకే పాఠశాలలో పనిచేస్తున్నారు. బొబ్బిలిలో ఉంటున్న ఈయన ప్రతిరోజూ పది కిలోమీటర్ల దూరంలో ఉన్న పాఠశాలకు సైకిల్‌పైనే వెళ్తారు. ఇంటికి తిరిగి వస్తారు. రోజూ 20 కిలోమీటర్లు సైకిల్‌ తొక్కుతారు. ఈయన్ను స్ఫూర్తిగా తీసుకుని ఎంతోమంది విద్యార్థులు రోజువారీ పనులకు సైకిల్‌నే వాడుతున్నారు. మొక్కల పెంపకాన్ని అమితంగా ఇష్టపడే కృష్ణదాస్‌.. సైకిల్‌పైనే మొక్కలు తీసుకువెళ్లి అందరితో నాటిస్తుంటారు. ఈ సేవలకు మెచ్చి గతంలో ప్రభుత్వం వనమిత్ర బిరుదుతో సత్కరించింది. సైకిల్‌ వినియోగంపై ఆయన ‘ఆంధ్రజ్యోతి’తో మాట్లాడుతూ తాను బోధనలో చురుకుగా ఉత్తేజంగా ఉండటానికి సైకిల్‌ తొక్కడమే ప్రధాన కారణమన్నారు.

- బొబ్బిలి రూరల్‌, జూన్‌2(ఆంధ్రజ్యోతి)

------------

Updated Date - Jun 03 , 2025 | 12:07 AM