శరన్నవరాత్రి ఉత్సవాలకు వేళాయే!
ABN , Publish Date - Sep 20 , 2025 | 12:00 AM
దసరా వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు జిల్లావాసులు సిద్ధమవుతున్నారు.
- 22 నుంచి అక్టోబరు 2 వరకు నిర్వహణ
- ముస్తాబవుతున్న ఆలయాలు
విజయనగనరం రూరల్, సెప్టెంబరు 19 (ఆంధ్రజ్యోతి): దసరా వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు జిల్లావాసులు సిద్ధమవుతున్నారు. ఈ నెల 22 నుంచి అక్టోబరు 2 వరకు దేవీ శరన్నవరాత్రులు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. దుర్గా పూజలకు మండపాలు సిద్ధం చేస్తున్నారు. తొమ్మిదిరోజుల పాటు కుంకుమార్చనలు, హోమాలు, సామూహిక రుద్రాభిషేకాలు, దీపోత్సవాలు వంటి పూజా కార్యక్రమాలను నిర్వహించనున్నారు. రోజుకో అవతారంలో దుర్గమ్మ తల్లి భక్తులకు దర్శనమివ్వనున్నారు. విజయనగరం పాతబస్టాండ్, బాబామెట్టలోని దుర్గాదేవి ఆలయాలతో పాటు పైడిమాంబ, కన్యకాపరమేశ్వరీ, జ్ఞానసరస్వతి ఆలయాల్లో దసరా ఉత్సవాలు జరగనున్నాయి. విజయనగరం న్యూపూర్ణజంక్షన్, కొత్తపేట యాదవ వీధి, కొణిశివీధి, బాబామెట్ట, దాసన్నపేట, కర్రల మార్కెట్, వీటిఅగ్రహరం, కేఎల్‌పురం తదితర ప్రాంతాల్లో శరన్నవరాత్రి ఉత్సవాలు నిర్వహించేందుకు నిర్వహకులు శరవేగంగా ఏర్పాట్లు చేస్తున్నారు.