It’s Not a Pond చెరువు కాదండోయ్..
ABN , Publish Date - Aug 15 , 2025 | 11:38 PM
It’s Not a Pond, You Know… ఈ ఫొటో చూసి చెరువు అనుకుంటే పొరబడినట్టే. గత రెండు రోజులుగా కురిసిన వర్షాలకు గిజబ గ్రామంలోని పంట పొలాలు ముంపునకు గురై ఇలా చెరువును తలపిస్తున్నాయి.
ఈ ఫొటో చూసి చెరువు అనుకుంటే పొరబడినట్టే. గత రెండు రోజులుగా కురిసిన వర్షాలకు గిజబ గ్రామంలోని పంట పొలాలు ముంపునకు గురై ఇలా చెరువును తలపిస్తున్నాయి. మండలంలోని తోటపల్లి, నందివానివలస, ఇటిక, తదితర ప్రాంతాల్లోని పామాయిల్, మామిడి, అరటి, వరి, కూరగాయల పంటలు నీట మునిగాయి. దీంతో రైతులు పలు ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. పంట పొలాల్లో చేరిన వర్షపు నీటిని మళ్లించేందుకు పడరాని పాట్లు పడుతున్నారు.
- గరుగుబిల్లి, ఆగస్టు 15(ఆంధ్రజ్యోతి)