Share News

It's Festival Time! ఉత్సవాలకు వేళాయే..

ABN , Publish Date - May 31 , 2025 | 11:56 PM

It's Festival Time! జిల్లా కేంద్రంలో ఉత్సవాల సందడి ప్రారంభమైంది. పార్వతీపురం పట్టణం, జగన్నాథపురం, బెలగాం ప్రజల ఇలవేల్పులు ఇప్పలపోలమ్మ, యర్రకంచమ్మ, బంగారమ్మ తల్లుల పండుగలు నేటి నుంచి నిర్వహించేందుకు ఉత్సవ కమిటీ సర్వం సిద్ధం చేసింది. ఇప్పటికే అమ్మవార్ల ఆలయాలను విద్యుత్‌ దీపాలతో సర్వాంగ సుందరంగా ముస్తాబు చేశారు. భక్తుల రద్దీ దృష్ట్యా ఎవరికీ ఎటువంటి కలగకుండా ముందస్తు ఏర్పాట్లు చేశారు.

It's Festival Time!  ఉత్సవాలకు వేళాయే..
విద్యుద్దీపాలంకరణలో యర్రకంచమ్మ ఆలయం

  • తొలిరోజు ఉయ్యాల కంబాలకు సర్వం సిద్ధం

  • 2న తొలేళ్లు, 3న సిరిమానోత్సవాలు

  • ఏర్పాట్లు పూర్తిచేసిన ఉత్సవ కమిటీ

  • పార్వతీపురంలో సందడే సందడి

పార్వతీపురం టౌన్‌, మే 31(ఆంధ్రజ్యోతి) : జిల్లా కేంద్రంలో ఉత్సవాల సందడి ప్రారంభమైంది. పార్వతీపురం పట్టణం, జగన్నాథపురం, బెలగాం ప్రజల ఇలవేల్పులు ఇప్పలపోలమ్మ, యర్రకంచమ్మ, బంగారమ్మ తల్లుల పండుగలు నేటి నుంచి నిర్వహించేందుకు ఉత్సవ కమిటీ సర్వం సిద్ధం చేసింది. ఇప్పటికే అమ్మవార్ల ఆలయాలను విద్యుత్‌ దీపాలతో సర్వాంగ సుందరంగా ముస్తాబు చేశారు. భక్తుల రద్దీ దృష్ట్యా ఎవరికీ ఎటువంటి కలగకుండా ముందస్తు ఏర్పాట్లు చేశారు. ఆదివారం సాయంత్రం నాయుడువీధిలోని ఇప్పలపోలమ్మ ఆలయ సమీపంలో రెడ్డి వీధిలో, జగన్నాఽథపురం యర్రకంచమ్మ ఆలయం వద్ద ఉయ్యాల కంబాల ఉత్సవాన్ని నిర్వహించ నున్నారు. ఇప్పలపోలమ్మ, యర్ర కంచమ్మల పండుగుల సందర్భంగా సోమవారం తొలేళ్లు, మంగళవారం అమ్మవార్ల సిరిమానుత్సోవాలను ఘనంగా నిర్వహిస్తున్నట్లు ఉత్సవ కమిటీ సభ్యులు స్పష్టం చేశారు.

సిరిమానులు సాగేదిలా...

- ఇప్పలపోలమ్మ సిరిమానును పూజారి ఆరిక రాజారావు, యర్రకంచమ్మ సిరిమానును నక్కా వాసు అధిరోహిస్తారు. మంగళవారం సాయంత్రం 6 గంటల నుంచి 7 గంటల మధ్య ఇప్పలపోలమ్మ సిరిమానుకు ప్రత్యేక పూజలు చేస్తారు. అనంతరం పూజారి రాజారావు సిరిమానును అధిరోహిస్తారు. నాయుడు వీధిలోని ప్రధాన ఆలయం నుంచి ఇప్పలపోలమ్మ సిరిమాను ప్రారంభమవుతుంది. భాను ప్రసాద్‌ ఆసుపత్రి నుంచి టౌన్‌ పోలీసు స్టేషన్‌వీధి, నాలుగు రోడ్ల కూడలి, ప్రధాన రహదారి మీదుగా వెంకటేశ్వర కళామందిర పాతబస్టాండ్‌ వరకు సిరిమాను వెళ్తుంది. పాతబస్టాండ్‌ నుంచి దంగిడి వీధి నుంచి మళ్లీ టౌన్‌ పోలీసు స్టేషన్‌వీధి, నాలుగు రోడ్డ కూడలి (కుడివైపు) మీదుగా గాంధీ సత్రం వరకు సిరిమానుత్సోవం సాగుతుంది. పద్మశ్రీ ఽథియేటర్‌లోని వనంగుడి వద్ద ఘాటాలకు పూజలు చేస్తారు. ఆ తర్వాత అనుపోత్సవం ప్రారంభమవుతుంది.

- జగన్నాఽథపురం యర్రకంచమ్మ ఆలయం వద్ద సిరిమానును అధిరోహించే పూజిరి నక్కా వాసుదేవరావు ప్రత్యేక పూజలు చేస్తారు. సాయంత్రం 6.30 నుంచి 7 గంటల మధ్యలో పూజారి సిరిమానును అధిరోహిస్తారు. అమ్మవారి ఆలయం నుంచి కొత్తవీధి, రాయగడ రోడ్డు, పాతబస్టాండ్‌ , టౌన్‌ పోలీసుస్టేషన్‌ వీధి ,తెలకల వీధి, కుసుమగుడ్డి వీధి కూడలి, కంచరవీధుల మీదుగా తిరిగి అమ్మవారి గుడి వరకు సిరిమానుత్సోవం సాగుతుంది.

Updated Date - May 31 , 2025 | 11:56 PM