Share News

ఐటీడీఏ పీవోలను కొనసాగించాలి

ABN , Publish Date - Aug 10 , 2025 | 12:06 AM

పాలకొండ సబ్‌ కలెక్టర్‌ యశ్వంత్‌కుమార్‌రెడ్డి, పార్వతీపురం సబ్‌ కలెక్టర్‌ అశుతోష్‌ శ్రీవాత్సవలను సీతంపేట, పార్వతీపురం ఐటీడీఏ ప్రాజెక్టు అధికారులుగా కొనసాగించాలని గిరిజన సంఘాలు కోరాయి.

ఐటీడీఏ పీవోలను కొనసాగించాలి
ర్యాలీ నిర్వహిస్తున్న గిరిజన సంఘ నాయకులు:

గుమ్మలక్ష్మీపురం, ఆగస్టు 9 (ఆంధ్రజ్యోతి):పాలకొండ సబ్‌ కలెక్టర్‌ యశ్వంత్‌కుమార్‌రెడ్డి, పార్వతీపురం సబ్‌ కలెక్టర్‌ అశుతోష్‌ శ్రీవాత్సవలను సీతంపేట, పార్వతీపురం ఐటీడీఏ ప్రాజెక్టు అధికారులుగా కొనసాగించాలని గిరిజన సంఘాలు కోరాయి. ఈ మేరకు గుమ్మలక్ష్మీపురంలో జరిగిన ఆదివాసీ దినోత్సవంలో పలు గిరిజన సంఘాల నాయకులు కోరారు. అనంతరం ఇరువురు పీవోలను కొనసాగించాలని ర్యాలీ నిర్వహించారు.

Updated Date - Aug 10 , 2025 | 12:06 AM