Share News

ITDA విధుల్లో ఐటీడీఏ ఇన్‌చార్జి పీవోలు

ABN , Publish Date - Aug 22 , 2025 | 11:27 PM

ITDA In-charge POs on Duty పార్వతీపురం, పాలకొండ సబ్‌ కలెక్టర్లు వైశాలి, పవార్‌ స్వప్నిల్‌ జగన్నాథ్‌లు ఐటీడీఏల ఇన్‌చార్జి పీవోలుగా బాధ్యతలు స్వీకరిం చారు. కలెక్టర్‌ శ్యామ్‌ప్రసాద్‌ ఆదేశాల మేరకు వారు శుక్రవారం పార్వతీపురం, సీతంపేట ఐటీడీఏ కార్యాలయాలకు చేరుకున్నారు.

ITDA  విధుల్లో ఐటీడీఏ ఇన్‌చార్జి పీవోలు
అధికారులతో సమీక్షిస్తున్న పార్వతీపురం ఐటీడీఏ ఇన్‌చార్జి పీవో

పార్వతీపురం/సీతంపేట రూరల్‌, ఆగస్టు22(ఆంధ్రజ్యోతి): పార్వతీపురం, పాలకొండ సబ్‌ కలెక్టర్లు వైశాలి, పవార్‌ స్వప్నిల్‌ జగన్నాథ్‌లు ఐటీడీఏల ఇన్‌చార్జి పీవోలుగా బాధ్యతలు స్వీకరిం చారు. కలెక్టర్‌ శ్యామ్‌ప్రసాద్‌ ఆదేశాల మేరకు వారు శుక్రవారం పార్వతీపురం, సీతంపేట ఐటీడీఏ కార్యాలయాలకు చేరుకున్నారు. పార్వతీపురం ఐటీడీఏ ఇన్‌చార్జి పీవో వైశాలి తొలుత ఏపీవో మురళీధర్‌, ఏఈవో ప్రసాద్‌ తదితర శాఖల అధికారులతో సమీక్షించారు. గిరిజనుల అభివృద్ధికి చర్యలు తీసుకోవాలని, అలసత్వం వహించొద్దని తెలిపారు. ఆదివాసీలకు నిర్ణీత సమయంలో సంక్షేమ పథకాలు అందించి, అభివృద్ధి పనులు చేపట్టాలని ఆదేశించారు. గిరిజన సంఘాల నాయకులతో మాట్లాడి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఇక సీతంపేట ఐటీడీఏ కార్యాలయంలో స్వప్నిల్‌ జగన్నాఽథ్‌ సీటీసీలపై సంతకాలు చేసి విధుల్లో చేరారు. తొలుత వివిధ శాఖల సెక్టోరియల్‌ అధికారులతో సమావేశం నిర్వహించారు. అనంతరం గిరిజనుల అభివృద్థికి ఐటీడీఏ ద్వారా అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. సమన్వయంతో పనిచేయాలని సూచించారు. ఏపీవో చిన్నబాబు, డీడీ అన్నదొర తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Aug 22 , 2025 | 11:27 PM