నాడు అధ్వానంగా.. నేడు అద్దంలా
ABN , Publish Date - Dec 17 , 2025 | 12:09 AM
ఒకప్పుడు నౌగూడ గ్రామానికి వెళ్లే రోడ్డు ఎక్కడికక్కడే రాళ్లు తేలి అధ్వానంగా ఉండేది.

ఇప్పుడు పూర్తయిన బీటీ రహదారి ఇలా..
ఒకప్పుడు నౌగూడ గ్రామానికి వెళ్లే రోడ్డు ఎక్కడికక్కడే రాళ్లు తేలి అధ్వానంగా ఉండేది. సుమారు 1.2కిలోమీటర్ల మేర రహదారి నరకానికి నకళ్లుగా ఉండేది. పక్కా రహదారి కోసం గత వైసీపీ ప్రభుత్వ హయాంలో ఇటు ప్రజా ప్రతినిధులకు అటు ఐటీడీఏ అధికారులకు ఎన్నోసార్లు గ్రామస్థులు విన్నవించుకున్నా ప్రయోజనం లేకుండా పోయింది. అయితే, కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టిన కొద్ది నెలల్లోనే పాలకొండ శాసనసభ్యుడు నిమ్మక జయకృష్ణ కృషితో ఇప్పుడు ఆ రోడ్డు అద్దంలా మారింది. జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం నిధులు రూ.80లక్షలతో బీటీ రహదారిని నిర్మించారు. దీంతో ఎన్నో ఏళ్ల గిరిజనుల కల నెరవేరింది. దీంతో నౌగూడ గ్రామస్థులతో పాటు చుట్టుపక్కల ఉన్న కోసిమానుగూడ, చింతమానుగూడ గ్రామాలకు చెందిన పీవీటీజీ గిరిజనులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
-సీతంపేట రూరల్, డిసెంబరు 16 (ఆంధ్రజ్యోతి):