It should remain a sweet feeling. మధురానుభూతిగా నిలిచిపోవాలి
ABN , Publish Date - Sep 20 , 2025 | 11:41 PM
It should remain a sweet feeling. పైడితల్లి అమ్మవారి పండుగ ప్రతిఒక్కరి మదిలో మధురానుభూతిగా నిలిచిపోవాలని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ అన్నారు. అమ్మవారి పండగ, విజయనగరం ఉత్సవం ఏర్పాట్లపై కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఆయన శనివారం సమీక్షించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ పండుగ కోసం నరగరమంతా సుందరీకరణ పనులు చేపట్టాలని, రహదారులపై గుంతలు లేకుండా చూడాలని, అతిథుల పట్ల ప్రొటోకాల్ సక్రమంగా చూడాలని అధికారులకు ఆదేశించారు.
మధురానుభూతిగా నిలిచిపోవాలి
ఆహ్లాదకర వాతావరణంలో అమ్మవారి పండుగ జరగాలి
మంత్రి కొండపల్లి శ్రీనివాస్
విజయనగరం, సెప్టెంబరు 20(ఆంధ్రజ్యోతి): పైడితల్లి అమ్మవారి పండుగ ప్రతిఒక్కరి మదిలో మధురానుభూతిగా నిలిచిపోవాలని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ అన్నారు. అమ్మవారి పండగ, విజయనగరం ఉత్సవం ఏర్పాట్లపై కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఆయన శనివారం సమీక్షించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ పండుగ కోసం నరగరమంతా సుందరీకరణ పనులు చేపట్టాలని, రహదారులపై గుంతలు లేకుండా చూడాలని, అతిథుల పట్ల ప్రొటోకాల్ సక్రమంగా చూడాలని అధికారులకు ఆదేశించారు. ఈ ఏడాది గత ఏడాది కన్నా అధికంగా మహిళలు వచ్చే అవకాశం ఉందని, రెగ్యులర్ ప్రయాణాలకు ఇబ్బంది కలగకుండా అన్ని రూట్లలో బస్సులను ఏర్పాటు చేయాలని, ఇతర జిల్లాల నుంచి సరిపడా బస్సులను తీసుకోవాలని సూచించారు. వందకు పైగా బయోటాయిలెట్‌లను ఏర్పాటు చెయ్యాలన్నారు. వృద్ధులు, దివ్యాంగులు, గర్భిణులు సులువుగా అమ్మవారిని దర్శించుకునేలా చర్యలు చేపట్టాలని మంత్రి అదేశించారు. అంతా కలిసి టీంవర్క్ చేసి విజయనగరం ఉత్సవాలు, పైడితల్లమ్మ సిరిమాను పండగను దిగ్విజయం చేద్దామన్నారు. విజయనగరం ఉత్సవాలపై మాట్లాడుతూ గత ఏడాది ఏఏ కార్యక్రమాలు నిర్వహించామో అంతకన్నా గొప్పగా ఈ ఏడాది నిర్వహించాలని తెలిపారు. ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు మాట్లాడుతూ మన సంస్కృతీసంప్రదాయాలు భవిష్యత్ తరాలకు తెలియజేసేలా విజయనగరం ఉత్సవాల్లో విద్యార్థులను భాగస్వామ్యం చేద్దామన్నారు. ఇందుకు సంబంధించి 27 మండలాల్లో వ్యాసరచన పోటీలు నిర్వహించాలని డీఈవోకు సూచించారు. ఎమ్మెల్యే అదితి గజపతిరాజు మాట్లాడుతూ సాధారణ భక్తులకు ఉచిత దర్శనాలను కల్పిస్తూ ఎటువంటి ఇబ్బంది కలగకుండా చూడాలన్నారు. కలెక్టర్ ఎస్.రామసుందర్ రెడ్డి మాట్లాడుతూ పండగ, ఉత్సవాల్లో ప్లాస్టిక్ వినియోగం లేకుండా చూడాలని, చెత్తను వెంటవెంటనే తొలగించి పరిశుభ్రంగా ఉండేలా చూడాలని మున్సిపల్ కమిషనర్ కు సూచించారు. సంయుక్త కలెక్టర్ సేథు మాధవన్ మాట్లాడుతూ క్రీడలు, సంగీత, సాంస్కృతిక కార్యక్రమాలు, సైన్సుఫెయిర్, కవి సమ్మేళనం, జానపద కళాప్రదర్శనలు, నాటికలు, నాటకాలు, పుష్ప ప్రదర్శన, సరస్ ఎక్జిబిషన్ తదితర వాటిని గత ఏడాదిలా నిర్వహించడానికి ప్రణాళిక సిద్ధం చేస్తున్నామన్నారు. సమావేశంలో అదనపు ఎస్‌పీ సౌమ్యలత, డీఆర్వో శ్రీనివాసమూర్తి, డీఆర్‌డీఏ పీడీ శ్రీనివాస్, అసిస్టెంట్ కమిషనర్ శిరీష, జిల్లా అధికారులు పాల్గొన్నారు.