Share News

మన్యం జిల్లాలో విలీనం చేయాలి

ABN , Publish Date - Aug 12 , 2025 | 12:06 AM

బొబ్బిలి అసెంబ్లీ నియోజకవర్గాన్ని పార్వతీపురం మన్యం జిల్లాలో విలీనం చేయాలని బొబ్బిలి బార్‌ అసోసియేషన్‌ ప్రతినిధులు డిమాండ్‌ చేశారు.

  మన్యం జిల్లాలో విలీనం చేయాలి
సమావేశంలో మాట్లాడుతున్న న్యాయవాదులు:

బొబ్బిలి, ఆగస్టు11 (ఆంధ్రజ్యోతి):బొబ్బిలి అసెంబ్లీ నియోజకవర్గాన్ని పార్వతీపురం మన్యం జిల్లాలో విలీనం చేయాలని బొబ్బిలి బార్‌ అసోసియేషన్‌ ప్రతినిధులు డిమాండ్‌ చేశారు. సోమవారం బొబ్బిలికోర్టు ప్రాంగణంలో బార్‌ అసోసియేషన్‌ అధ్యక్షు డు మత్స ఆనందకుమార్‌ అధ్యక్షతన ఏర్పాటు చేసిన సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆనంద్‌కుమార్‌ మాట్లాడుతూ గతంలో జిల్లాల పునర్విభజన జరిగిన సమయంలో బొబ్బిలిని పార్వతీపురం మన్యం జిల్లాలో విలీనం చేయాలన్న వినతిని అప్పటి ప్రభుత్వం పెడచెవిన పెట్టిందని తెలిపారు. బొబ్బిలికి విజయనగరం 60 నుంచి 80 కిలోమీటర్ల ఉండడంతో తీవ్ర వ్యయప్రయాసలకోర్చాల్సి వస్తోందని, బొబ్బిలికి పార్వ తీపురం కేవలం 30 కిలోమీటర్ల దూరం మాత్రమే ఉండడంతో అన్ని వర్గాల ప్రజలకు ఎంతో వెసులుబాటుగా ఉంటుందని తెలిపారు. అంశాలన్నింటినీ పరిగణనలోకి తీసుకొని బొబ్బిలి అసెంబ్లీ నియోజకవర్గాన్ని విజయనగరం జిల్లా నుంచి పార్వతీపురం మన్యం జిల్లాకు అప్పగించాలని కోరారు. సమావేశంలో అసోసియేషన్‌ కార్యదర్శి రుంకాన ప్రసాదరావు, న్యాయవాదులు కండాపు ప్రసాదరావు, జాగారపు శ్రీనివాసరా వు, గునుపూరు స్వామినాయుడు, ప్రసన్నకుమార్‌, పెదపెంకి శివప్రసాద్‌, అమ్మాజీ రావు, మురళి పాల్గొన్నారు.

Updated Date - Aug 12 , 2025 | 12:06 AM