Share News

సారా రహిత జిల్లాగా తీర్చిదిద్దాలి

ABN , Publish Date - Sep 11 , 2025 | 11:42 PM

నవోదయం 2.0 కింద సారా రహిత జిల్లాగా పార్వతీపురాన్ని తీర్చిదిద్దాలని జిల్లా రెవెన్యూ అధికారి కె.హేమలత అన్నారు.

 సారా రహిత జిల్లాగా తీర్చిదిద్దాలి
మాట్లాడుతున్న డీఆర్వో హేమలత

డీఆర్వో హేమలత

పార్వతీపురం, సెప్టెంబరు 11 (ఆంధ్రజ్యోతి): నవోదయం 2.0 కింద సారా రహిత జిల్లాగా పార్వతీపురాన్ని తీర్చిదిద్దాలని జిల్లా రెవెన్యూ అధికారి కె.హేమలత అన్నారు. కలెక్టర్‌ కార్యాలయ సమావేశ మందిరంలో వివిధ శాఖాధికారులతో గురువారం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. అధికారుల సమష్టి కృషితోనే సారా నిర్మూలన సాధ్యమన్నారు. జిల్లాకు సమీపంలో ఒడిశా సరిహద్దు ప్రాంతాలు ఉన్నందున అంతర ర్రాష్ట్ర తనిఖీలను మరింత విస్తృతం చేయాలని అన్నారు. ఎక్సైజ్‌ అండ్‌ ప్రొహిబిషన్‌ శాఖ అసిస్టెంట్‌ కమిషనర్‌ పి.రామచం ద్రరావు మాట్లాడుతూ.. జిల్లాలో 137 గ్రామాలను ఏబీసీ గ్రామాలుగా వర్గీకరించి ఆ గ్రామాలకు దత్తత అధికారులను నియమించినట్లు తెలిపారు. పోస్టర్లు, కరపత్రాలు, ప్రచార రథం ద్వారా నవోయదయ 2.0పై పెద్ద ఎత్తున అవగాహన కల్పిస్తున్నామన్నారు. గత నాలుగు మాసాల్లో 227 కేసులు పెట్టి 337 మందిని అరెస్టు చేశామన్నారు. 9,090 లీటర్ల సారాను, 35,740 పులియబెట్టిన నల్లబెల్లాన్ని ధ్వంసం చేసినట్టు తెలిపారు. 38 వాహనాలను సీజ్‌ చేశామన్నారు. సమావేశంలో ఎక్సైజ్‌ సూపరింటెండెంట్‌ బి.శ్రీనాథుడు, గిరిజన సంక్షేమశాఖ ఉప సంచాలకులు ఆర్‌.కృష్ణవేణి, అసిస్టెంట్‌ ప్రొహిబిషన్‌ సూపరింటెండెండ్‌, ఎక్సైజ్‌ ఇన్‌స్పెక్టర్లు, ఇతర అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Sep 11 , 2025 | 11:42 PM