Share News

ఇది పేదల ప్రభుత్వం

ABN , Publish Date - Jul 17 , 2025 | 12:08 AM

కూటమి ప్రభు త్వం పేదల సంక్షేమం కోసం అహర్నిశలు కృషి చేస్తోం దని ఎమ్మెల్యే కిమిడి కళావెంకటరావు అన్నారు.

ఇది పేదల ప్రభుత్వం

చీపురుపల్లి, జులై 16 (ఆంధ్రజ్యోతి): కూటమి ప్రభు త్వం పేదల సంక్షేమం కోసం అహర్నిశలు కృషి చేస్తోం దని ఎమ్మెల్యే కిమిడి కళావెంకటరావు అన్నారు. సుపరి పాలనలో తొలి అడుగు కార్యక్రమంలో భాగంగా పట్టణం లోని జి.అగ్రహారంలో బుధవారం ఆయన ఇంటింటికి తిరిగి ప్రభుత్వ కార్యక్రమాలను వివరించారు. పార్టీ నాయ కులు గద్దే బాబూరావు, కుచ్చర్లపాటి త్రిమూర్తులరాజు, రౌతు కామునాయుడు, రౌతు కాంతమ్మ, గవిడి నాగరాజు, కలిశెట్టి సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.

మాట నిలబెట్టుకున్నారు

వేపాడ, జూలై 16 (ఆంధ్రజ్యోతి): చంద్రబాబు ఇచ్చిన హామీలన్నీ అమలు చేసి మాట నిలబెట్టుకున్నారని ఎమ్మెల్యే కోళ్ల లలితకుమారి అన్నారు. సుపరిపాలనలో తొలిఅడుగు కార్యక్రమంలో భాగంగా బుధవారం ఆమె వేపాడలో పర్యటించారు. రానున్న సంస్థగత ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థులను గెలిపించాలని కోరారు. మాజీ ఎంపీపీ దాసరి లక్ష్మి, టీడీపీ మండల ప్రధాన కార్యదర్శి కొట్యాడ రమణమూర్తి, నియోజకవర్గ మహిళా అధ్యక్షురాలు గుమ్మడి భారతి, పార్టీ మండల ఉపాధ్యక్షుడు పోతల వెంకటరమణ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Jul 17 , 2025 | 12:08 AM