Share News

వైసీపీ నాయకులు తిరుమలపై మాట్లాడడం విడ్డూరం

ABN , Publish Date - Sep 22 , 2025 | 12:08 AM

తిరుమలపై వైసీపీ నాయకులు మాట్లాడ డం విడ్డూరంగా ఉందని ఎంపీ కలిశెట్టి అప్పల నాయుడు అన్నారు.

వైసీపీ నాయకులు తిరుమలపై మాట్లాడడం విడ్డూరం

  • ఎంపీ కలిశెట్టి

విజయనగరం రూరల్‌, సెప్టెంబరు 21(ఆంధ్ర జ్యోతి): తిరుమలపై వైసీపీ నాయకులు మాట్లాడ డం విడ్డూరంగా ఉందని ఎంపీ కలిశెట్టి అప్పల నాయుడు అన్నారు. స్థానిక టీడీపీ కార్యాలయంలో ఆదివారం నిర్వహించిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. వైసీపీ ఐదేళ్ల పాలనలో తిరుమల పవిత్రత, భక్తుల మనోభావాలని దెబ్బతీసిన వైసీపీ నాయకులు ఇప్పుడు తిరుమలపై మాట్లాడడం ఎంతవరకు సబబని ప్రశ్నించారు. టీటీడీ పాలకవర్గం, ప్రభుత్వంపై వైసీపీ అసత్య ప్రచా రాలు చేస్తున్నదని, దీనిని ప్రజలు నమ్మే స్థితిలో లేరన్నారు. 15 నెలల కాలంలో ప్రభుత్వం అద్భుత పాలన సాగించిందన్నారు. వైద్య కళాశాలలను ప్రైవేటీ కరణ చేస్తున్నామని వైసీపీ రాద్ధాంతం చేస్తున్నదన్నా రు. పీపీపీ విధానంలో వైద్య కళాశాలలను అద్భుతంగా నడిపించాలని చంద్రబాబు ఆలోచన చేస్తున్నారన్నారు. వైసీపీ నేత జగన్మోహన్‌రెడ్డి, వైసీపీ తరపున గెలిచిన ఎమ్మెల్యేలు శాసనసభకు వె ళ్లకుండా కాలక్షేపం చేస్తున్నారన్నారు. ఈ సమావేశంలో టీడీపీ నాయకుడు విజ్జపు ప్రసాద్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Sep 22 , 2025 | 12:08 AM