క్లస్టర్ బాధ్యతలు అప్పగించడం తగదు
ABN , Publish Date - Sep 07 , 2025 | 12:08 AM
క్లస్టర్ బాధ్యతలు అప్పగించడం తగదని, ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని గ్రామ,వార్డు సచివాలయ ఉద్యోగులు కోరారు.
పాలకొండ, సెప్టెంబరు 6 (ఆంధ్రజ్యోతి): క్లస్టర్ బాధ్యతలు అప్పగించడం తగదని, ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని గ్రామ,వార్డు సచివాలయ ఉద్యోగులు కోరారు. శనివారం పాలకొండ నగర పంచాయతీ కార్యాలయం వద్దక్లస్టర్ బాధ్యతలను తమకు అప్పజెప్పడంపై నల్లబ్యాడ్జీలు ధరించి నిరసన తెలిపారు. అనంతరం కమిషనర్ రత్నంరాజుకు వినతిపత్రం అందజేశారు.