Share News

ప్రాథమిక దశలో క్యాన్సర్‌ను గుర్తిస్తే మేలు

ABN , Publish Date - Aug 22 , 2025 | 12:03 AM

క్యాన్సర్‌ను ప్రాథమిక దశలో గుర్తిస్తే ప్రాణాపాయం తప్పుతుందని జిల్లా వైద్యఆరోగ్యశాఖాధికారి ఎస్‌.భాస్కరరావు అన్నారు.

  ప్రాథమిక దశలో క్యాన్సర్‌ను గుర్తిస్తే మేలు
మాట్లాడుతున్న డీఎంహెచ్‌వో భాస్కరరావు

- జిల్లా వైద్యఆరోగ్యశాఖాధికారి భాస్కరరావు

పార్వతీపురం, ఆగస్టు 21 (ఆంధ్రజ్యోతి): క్యాన్సర్‌ను ప్రాథమిక దశలో గుర్తిస్తే ప్రాణాపాయం తప్పుతుందని జిల్లా వైద్యఆరోగ్యశాఖాధికారి ఎస్‌.భాస్కరరావు అన్నారు. ఎన్‌సీడీ 4.0లో భాగంగా క్యాన్సర్‌ స్ర్కీనింగ్‌పై వైద్యాధికారులు, వైద్య సిబ్బందికి గురువారం ఎన్‌జీవో హోంలో శిక్షణ కార్య క్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా డీఎంహెచ్‌వో భాస్కరరావు మాట్లాడుతూ.. క్యాన్సర్‌లో ముఖ్యంగా నోటి, రొమ్ము, గర్భాశయ ముఖద్వార క్యాన్సర్‌ కేసులు ఎక్కువగా నమోదు అవుతున్నాయన్నారు. క్షేత్రస్థాయిలో తాము నిర్దేశించిన లక్ష్యాలను అధిగమించేందుకు వైద్యాధికారులు కృషి చేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఎన్‌సీడీ ప్రోగ్రాం అధికారి డాక్టర్‌ జగన్మోహన్‌రావు, కో-ఆర్డినేటర్‌ డాక్టర్‌ సునీల్‌, డీపీఎంవో రఘుకుమార్‌, వైద్యులు పాల్గొన్నారు.

Updated Date - Aug 22 , 2025 | 12:03 AM