Share News

It is a pleasure for the CM to come to Datti. దత్తికి సీఎం రావడం ఆనందదాయకం

ABN , Publish Date - Sep 30 , 2025 | 12:05 AM

It is a pleasure for the CM to come to Datti. వ్యవసాయంపై ఆధారపడే రైతులు అధికంగా ఉన్న దత్తి గ్రామానికి ముఖ్యమంత్రి రావడం ఆనందించదగ్గ విషయమని మంత్రి కొండపల్లి శ్రీనివాస్‌ అన్నారు. దత్తి గ్రామానికి బుధవారం సీఎం రానుండడంతో పర్యటన ఏర్పాట్ల పరిశీలనకు మంత్రి సోమవారం గ్రామాన్ని సందర్శించారు. హెలిపాడ్‌ నుంచి ప్రజావేదిక వద్దకు, పింఛనుదారుల గృహాల వద్దకు ముఖ్యమంత్రి వెళ్లే మార్గాన్ని, రాజకీయ ప్రతినిధుల సమావేశానికి ఏర్పాటు చేసిన హాల్‌ను, ముఖ్యమంత్రి విశ్రాంతి కోసం ఏర్పాటు చేస్తున్న గ్రీన్‌ రూమ్‌ను కలెక్టర్‌ ఎస్‌.రామసుందర్‌రెడ్డి, ఎస్పీ ఏఆర్‌ దామోదర్‌తో కలిసి మంత్రి పరిశీలించారు.

It is a pleasure for the CM to come to Datti. దత్తికి సీఎం రావడం ఆనందదాయకం
ముఖ్యమంత్రి పర్యటన ఏర్పాట్లను పరిశీలిస్తున్న మంత్రి కొండపల్లి శ్రీనివాస్‌

దత్తికి సీఎం రావడం ఆనందదాయకం

పర్యటన ఏర్పాట్లను పరిశీలించిన మంత్రి కొండపల్లి

దత్తిరాజేరు, సెప్టెంబరు 29(ఆంధ్రజ్యోతి): వ్యవసాయంపై ఆధారపడే రైతులు అధికంగా ఉన్న దత్తి గ్రామానికి ముఖ్యమంత్రి రావడం ఆనందించదగ్గ విషయమని మంత్రి కొండపల్లి శ్రీనివాస్‌ అన్నారు. దత్తి గ్రామానికి బుధవారం సీఎం రానుండడంతో పర్యటన ఏర్పాట్ల పరిశీలనకు మంత్రి సోమవారం గ్రామాన్ని సందర్శించారు. హెలిపాడ్‌ నుంచి ప్రజావేదిక వద్దకు, పింఛనుదారుల గృహాల వద్దకు ముఖ్యమంత్రి వెళ్లే మార్గాన్ని, రాజకీయ ప్రతినిధుల సమావేశానికి ఏర్పాటు చేసిన హాల్‌ను, ముఖ్యమంత్రి విశ్రాంతి కోసం ఏర్పాటు చేస్తున్న గ్రీన్‌ రూమ్‌ను కలెక్టర్‌ ఎస్‌.రామసుందర్‌రెడ్డి, ఎస్పీ ఏఆర్‌ దామోదర్‌తో కలిసి మంత్రి పరిశీలించారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తరువాత మొదటిసారిగా విజయనగరం జిల్లాలో ముఖ్యమంత్రి పర్యటనకు వస్తున్నారని, ఈ పర్యటన తాను ప్రాతినిధ్యం వహిస్తున్న గజపతినగరం నియోజకవర్గంలోని దత్తి గ్రామంలో జరుగుతుండడం సంతోషించాల్సిన విషయం అన్నారు. దత్తి గ్రామ అభివృద్ధి, ప్రజల కష్టసుఖాలను ముఖ్యమంత్రి స్వయంగా తెలుసుకుంటారని చెప్పారు. ప్రతి నెలా ఒకటో తేదీన నిర్వహిస్తున్న పేదల దినోత్సవంలో భాగంగా ముఖ్యమంత్రి ఇక్కడ పెన్షన్‌ పంపిణీ చేయనున్నారని తెలిపారు. సుదీర్ఘకాలంగా అపరిష్కృతంగా ఉన్న సార్వగడ్డ రిజర్వాయర్‌ గురించి ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్లి సాగునీటి సమస్య పరిష్కారం కోసం ప్రయత్నిస్తానని చెప్పారు. ఈ ప్రాంతంలో రైతులకు సాగునీరు అందించేందుకు అవకాశం ఉన్న తోటపల్లి కాలువ పనులను త్వరలో పూర్తిచేసే అవకాశం ఉందన్నారు. మంత్రి వెంట జేసీ సేతుమాధవన్‌, అదనపు ఎస్పీ సౌమ్యలత, వివిధ శాఖల జిల్లా అధికారులు, నాలుగు మండలాల టీడీపీ అధ్యక్షులు, మాజీ జడ్పీటీసీలు, మాజీ ఎంపీటీసీలు, క్లష్టర్‌ ఇన్‌చార్జ్‌లు తదితరులు పాల్గొన్నారు.

ముఖ్యమంత్రి పర్యటన షెడ్యూల్‌ ఖరారు

బొబ్బిలి, సెప్టెంబరు29(ఆంరఽధజ్యోతి):

ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు వచ్చే నెల 1న జిల్లాలో పర్యటించనున్న విషయం తెలిసిందే. పర్యటన షెడ్యూల్‌ను అధికారులు సోమవారం విడుదల చేశారు. 1న ఉదయం 11 గంటలకు విశాఖ ఎయిర్‌పోర్టుకు చేరుకుంటారు. 11.20 గంటలకు విశాఖ నుంచి హెలికాప్టర్‌లో బయలుదేరి గజపతినగరం నియోజక వర్గం దత్తి గ్రామానికి 11.30 గంటలకు చేరుకుంటారు. 11.50 గంటలకు గ్రామంలోని ప్రజావేదిక వద్దకు వెళ్తారు. మధ్యాహ్నం 1.20 గంటల వరకు మీటింగ్‌లో పాల్గొంటారు. మధ్యాహ్నం 1.55 గంటల నుంచి 2.10 గంటల వరకు దత్తి గ్రామంలో ఎన్టీఆర్‌ భరోసా పింఛన్లు పంపిణీ చేస్తారు. 2.10 నుంచి 2.35 గంటల వరకు లబ్ధిదారులతో ముఖాముఖిలో పాల్గొంటారు. 2.40 గంటలకు దత్తిలో జరిగే పార్టీ శ్రేణుల సమావేశంలో పాల్గొంటారు. సాయంత్రం 4 గంటల వరకు పార్టీ శ్రేణులతోనే ఉంటారు. 4.05 గంటలకు హెలిపాడ్‌ వద్దకు చేరుకొని హెలికాప్టర్‌లో బయలుదేరి తాడేపల్లి మండలం ఉండవల్లిలోని నివాసానికి సీఎం చేరుకుంటారని అధికారిక వర్గాలు వెల్లడించాయి.

Updated Date - Sep 30 , 2025 | 12:05 AM