Share News

ప్రకటన జారీచేసి ప్రచారం నిర్వహించి..

ABN , Publish Date - Jul 24 , 2025 | 12:17 AM

కొత్తవలస జడ్పీ ఉన్నతపాఠశాలలో విద్యార్థి ప్రతినిధుల ఎన్నిక సాధారణ ఎన్నికలు తలపించే విధంగా బుధవారం మధ్యాహ్నం నిర్వహించారు.తొలుత ఎన్నికల ప్రకటన జారిచేసి, పోటీ చేసే అభ్యుర్థుల నుంచి డిపాజిట్‌ వసూలు చేశారు.

 ప్రకటన జారీచేసి ప్రచారం నిర్వహించి..
విద్యార్థి ప్రతినిధుల ఎన్నికల వల్ల కోలాహలంగా మారిన పాఠశాల ప్రాంగణం

కొత్తవలస, జూలై 23 (ఆంధ్రజ్యోతి) : కొత్తవలస జడ్పీ ఉన్నతపాఠశాలలో విద్యార్థి ప్రతినిధుల ఎన్నిక సాధారణ ఎన్నికలు తలపించే విధంగా బుధవారం మధ్యాహ్నం నిర్వహించారు.తొలుత ఎన్నికల ప్రకటన జారిచేసి, పోటీ చేసే అభ్యుర్థుల నుంచి డిపాజిట్‌ వసూలు చేశారు. అనంతరం ఎన్నికల ఏజెంట్ల నియామకం, ప్రచార కార్యక్రమం, ఓటింగ్‌, కౌంటింగ్‌ ప్రక్రియ నిర్వహించారు. సాధారణ ఎన్నికలు ఎలా జరుగుతాయన్న విషయాన్ని ప్రత్యక్షంగా విద్యార్థులకు తెలియజేసేందుకు ఏర్పాటు చేసినట్లు హెచ్‌ఎం ఈశ్వరరావు తెలిపారు. ఎన్నికల అధికారులుగా బండారు మోహానరావు, వి.అప్పారావు, పి.నరసమ్మలు వ్యవహరించారు.

Updated Date - Jul 24 , 2025 | 12:17 AM