Share News

Register for EHR? ఈహెచ్‌ఆర్‌ నమోదు ఇలాగేనా?

ABN , Publish Date - Mar 21 , 2025 | 11:43 PM

Is This How to Register for EHR? కొమరాడ మండలం మాదలింగి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఎలకా్ట్రనిక్‌ హెల్త్‌ రికార్డు (ఈహెచ్‌ఆర్‌) నమోదు తక్కువగా ఉండడంపై డీఎంహెచ్‌వో ఎస్‌.భాస్కరరావు అసంతృప్తి వ్యక్తం చేశారు. రికార్డు నమోదు ఇలాగేనా? అంటూ ప్రశ్నించారు. తీరు మార్చుకోవాలని సిబ్బందిని ఆదేశించారు.

  Register for EHR? ఈహెచ్‌ఆర్‌ నమోదు ఇలాగేనా?
ల్యాబ్‌ రికార్డులను పరిశీలిస్తున్న డీఎంహెచ్‌వో

కొమరాడ, మార్చి 21 (ఆంధ్రజ్యోతి): కొమరాడ మండలం మాదలింగి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఎలకా్ట్రనిక్‌ హెల్త్‌ రికార్డు (ఈహెచ్‌ఆర్‌) నమోదు తక్కువగా ఉండడంపై డీఎంహెచ్‌వో ఎస్‌.భాస్కరరావు అసంతృప్తి వ్యక్తం చేశారు. రికార్డు నమోదు ఇలాగేనా? అంటూ ప్రశ్నించారు. తీరు మార్చుకోవాలని సిబ్బందిని ఆదేశించారు. శుక్రవారం ఆయన పీహెచ్‌సీని ఆకస్మికంగా తనిఖీ చేశారు. రికార్డులు, లేబొరేటరీ, మందుల నిల్వలు, వార్డు, లేబర్‌ రూమును పరిశీలించారు. ఈ నెలలో జ్వర నిర్ధారణ పరీక్షలు , వాటి నివేదికలు, ల్యాబ్‌ రికార్డుల్లో నమోదైనది లేనిది తనిఖీ చేసి తగు సూచనలు చేశారు. సిబ్బంది అన్ని వేళలా రోగులకు అందుబాటులో ఉండాలని ఆదేశించారు. గ్రామంలో పరిసరాలను నిశితంగా పరిశీలించి దోమల లార్వా ప్రదేశాలను గుర్తించాలన్నారు. వెక్టార్‌ కంట్రోల్‌ హైజీన్‌ యాప్‌లో సమస్యాత్మక ప్రదేశాల వివరాలను వెంటనే నమోదు చేయాలని సూచించారు. అనంతరం దళాయిపేటలో గ్రామీణ ఆరోగ్య కేంద్రాన్ని తనిఖీ చేసి ఎన్‌సీడీ సర్వే తీరుపై ఆరా తీశారు. సన్‌ స్ట్రోక్‌పై ప్రజలను అప్రమత్తం చేయాలని వైద్య సిబ్బందికి సూచించారు. ఈ పరిశీలనలో డాక్టర్‌ ఎస్‌.తనూజ, కార్యాలయ డెమో సన్యాసిరావు, సీసీ శ్రీనివాసరావు తదితరులు ఉన్నారు.

Updated Date - Mar 21 , 2025 | 11:43 PM