Rains? వర్షం పడితే ఇంతేనా?
ABN , Publish Date - Aug 09 , 2025 | 11:29 PM
Is This All When It Rains? జిల్లా కేంద్రంలో వర్షం పడితే చాలు మురుగునీరు రోడ్డెక్కుతోంది. ఎక్కడికక్కడ నీరు నిలిచిపోవడంతో ప్రజలు, వాహనదారులు రాకపోకలు సాగించలేని పరిస్థితి ఏర్పడుతోంది. దీనిపై ప్రజాప్రతినిధులు , అధికారులు స్పందించకపోవడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
ప్రజలకు తప్పని ఇబ్బందులు
పట్టించుకోని ప్రజాప్రతినిధులు, అధికారులు
పార్వతీపురం, ఆగస్టు 9(ఆంధ్రజ్యోతి): జిల్లా కేంద్రంలో వర్షం పడితే చాలు మురుగునీరు రోడ్డెక్కుతోంది. ఎక్కడికక్కడ నీరు నిలిచిపోవడంతో ప్రజలు, వాహనదారులు రాకపోకలు సాగించలేని పరిస్థితి ఏర్పడుతోంది. దీనిపై ప్రజాప్రతినిధులు , అధికారులు స్పందించకపోవడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. శనివారం పార్వతీపురంలో ఓ మోస్తరుగా వర్షం కురిసింది. దీంతో మేదరవీధి జంక్షన్‌తో పాటు అనేక వీధుల్లో మురుగునీరు నిలిచింది. రెడ్డివీధి సమీపంలో రోడ్డుపైకి కూడా మురుగునీరు ప్రవహించడంతో ఆయా ప్రాంతవాసులు నానా అవస్థలు పడ్డారు. జిల్లా కేంద్రంలో చాలాచోట్ల ఇదే పరిస్థితి నెలకొనడంతో పట్టణవాసులు పెదవి విరుస్తున్నారు. వర్షం కురిసిన ప్రతిసారీ ఇలా మురుగునీరు నిలిచిపోవడంతో దుర్వాసన, దోమల కారణంగా తరచూ రోగాల బారిన పడాల్సి వస్తోందని ఆవేదన చెందుతున్నారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించాలని వారు డిమాండ్ చేస్తున్నారు.