Share News

Is the will relaxed? సంకల్పం సడలిందా!

ABN , Publish Date - Dec 02 , 2025 | 12:28 AM

Is the will relaxed? పాలిథిన్‌ నిషేధాన్ని ఒకప్పుడు దిగ్విజయంగా అమలు చేసిన బొబ్బిలి మునిసిపాలిటీలో నేడు ప్లాస్టిక్‌ను విరివిగా వినియోగిస్తున్నారు. కాలుష్య నియంత్రణలో ఎంతో పేరు సంపాదించిన మునిసిపాలిటీ ఇప్పుడు అందుకు భిన్నంగా తయారైంది. ఎక్కడికక్కడే ప్లాస్టిక్‌ ఆనవాళ్లు కనిపిస్తున్నాయి. ఎందుకిలా? అని సగటు బొబ్బిలి పౌరుడు ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు.

Is the will relaxed? సంకల్పం సడలిందా!
బొబ్బిలి- పెంట రోడ్డులో చెత్తకుప్పలు

సంకల్పం సడలిందా!

బొబ్బిలిలో ఎందుకిలా?

బొబ్బిలి, డిసెంబరు 1(ఆంధ్రజ్యోతి): పాలిథిన్‌ నిషేధాన్ని ఒకప్పుడు దిగ్విజయంగా అమలు చేసిన బొబ్బిలి మునిసిపాలిటీలో నేడు ప్లాస్టిక్‌ను విరివిగా వినియోగిస్తున్నారు. కాలుష్య నియంత్రణలో ఎంతో పేరు సంపాదించిన మునిసిపాలిటీ ఇప్పుడు అందుకు భిన్నంగా తయారైంది. ఎక్కడికక్కడే ప్లాస్టిక్‌ ఆనవాళ్లు కనిపిస్తున్నాయి. ఎందుకిలా? అని సగటు బొబ్బిలి పౌరుడు ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు.

సుమారు దశాబ్దన్నరకాలంగా బొబ్బిలిలో పాలిథిన్‌ నిషేధాన్ని అమలు చేస్తున్నారు. అందుకు గతంలో కమిషనర్‌గా పనిచేసిన కరుణాకరం ప్రసాద్‌ పునాది వేశారు. ప్రజాప్రతినిఽధులు, అధికారులు, ఉద్యోగులు, సామాజిక సంస్థలు, విద్యాసంస్థల ప్రతినిధులను ఆయన సమన్వయం చేసుకుంటూ ప్రజలందరినీ పర్యావరణ హితంగా మెలిగేలా ప్రేరేపించి అద్భుతమైన విజయాలు సాధించారు. ఇంటింటి చెత్తసేకరణ, తడిచెత్త, పొడిచెత్త వేరుచేయడం, ఎరువుల తయారీ వంటి కార్యకలాపాలను అమలు చేశారు. అభిమాని స్వచ్ఛంద సంస్థ వ్యవస్థాపకుడు రెడ్డి రాజగోపాలనా యుడు ఎకో క్లబ్‌లు, గ్రీనరీ క్లబ్‌లను ఏర్పాటుచేసి సమాజంలోని అన్ని వర్గాల వారిని భాగస్వామ్యం చేశారు. మునిసిపాలిటీ చేపట్టే కార్యక్రమాలకు చేదోడువాదోడుగా నిలిచారు. అలాంటి బొబ్బిలిలో నేటికీ ప్రజలు వివిధ రూపాల్లో కాలుష్యాన్ని ఎదుర్కొంటున్నారు.

బొబ్బిలి పట్టణంలో మొక్కలను ఎప్పటికప్పుడు తొలగిస్తున్నారు. ఇటు ప్రజలు రోడ్డు పక్క ప్రాంతాల్లో పెద్దఎత్తున చెత్తాచెదారాలను పారబోస్తున్నారు. విచ్చలవిడిగా కోళ్ల ఫారాలు ఏర్పాటు చేస్తున్నారు. వీటి నుంచి వెలువడే వ్యర్థాలను చేపల చెరువుల్లో వినియోగిస్తున్నారు. దీనివల్ల ఇటు జల కాలుష్యం కూడా పెరుగుతోంది. బొబ్బిలి గ్రోత్‌సెంటరులో పచ్చదనం పెంచేందుకు ఖాళీస్థలాలు కేటాయించారు. అందులో నాటిన మొక్కలు ఏపుగా మారాయి. గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో వాటన్నింటినీ గొడ్డలి వేటుకు గురిచేశారు. వాటి స్థానంలో కొత్తగా మొక్కలు నాటలేదు.

కాలుష్యం నివారణ పేరుతో భారీ అవినీతి

బెవర గణేశ్‌, యూత్‌ ప్రతినిధి, బొబ్బిలి

పరిశ్రమల్లో కాలుష్య నివారణ కోసం ప్రత్యేక యంత్రాలు వాడేందుకు విద్యుత్‌ను భారీ సబ్సిడీతో సరఫరా చేస్తోంది. ఆ విద్యుత్‌తో యజమానులు కాలుష్య నివారణకు చర్యలు తీసుకోకుండా తమ ఉత్పత్తులను పెంచుకొని లాభాలు ఆర్జిస్తున్నారు. ఈ ప్రక్రియలో అధికారులకు పెద్దఎత్తున మామూళ్లు అందుతున్నాయి. ప్రజల ఆరోగ్యం ఎలా పోయినా వారికి పట్టడం లేదు. ఇళ్లపై ప్రతిరోజూ చేరే దుమ్మును తొలగించుకునేందుకు ప్రజలు నానా అవస్థలు పడుతున్నారు.

Updated Date - Dec 02 , 2025 | 12:28 AM