Irrigation Water 24,640 ఎకరాలకు సాగునీరు
ABN , Publish Date - Jun 04 , 2025 | 11:57 PM
Irrigation Water for 24,640 Acres జిల్లాలో ఐదు మండలాల పరిధిలోని 75 గ్రామాల్లో సుమారు 24,640 ఎకరాలకు సాగునీరు సరఫరా చేయడానికి ప్రతిపాదనలు సిద్ధం చేశామని జలవనరులశాఖ కార్యనిర్వాహక ఇంజనీర్ ఎ.ఢిల్లీశ్వరరావు బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు.
జలవనరులశాఖ కార్యనిర్వాహక ఇంజనీర్ ఢిల్లీశ్వరరావు
పార్వతీపురం, జూన్ 4(ఆంధ్రజ్యోతి): జిల్లాలో ఐదు మండలాల పరిధిలోని 75 గ్రామాల్లో సుమారు 24,640 ఎకరాలకు సాగునీరు సరఫరా చేయడానికి ప్రతిపాదనలు సిద్ధం చేశామని జలవనరులశాఖ కార్యనిర్వాహక ఇంజనీర్ ఎ.ఢిల్లీశ్వరరావు బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. గత 21న ‘ఆంధ్రజ్యోతి’లో ప్రచురితమైన ఖరీఫ్‌నకు సాగునీరు అందేనా? అనే కథనంపై ఆయన స్పందించారు. ఒడిశా ప్రభుత్వం అనుమతి లభించని కారణంగా జంఝావతి ద్వారా లో లెవెల్ కాలువ, 1ఆర్ కాలువ ద్వారా చెరో 12,320 ఎకరాలకు నీటిని అందించేందుకు ప్రతిపాదించా మన్నారు. 2008 నుంచి 1 ఆర్ కాలువ కింద కొంత భాగం ఆయకట్టుకు నీటి సరఫరా జరుగుతుందన్నారు. ఎత్తిపోతల పథకం ద్వారా నీటి సరఫరా చేసే సమయంలో ట్రాన్స్‌ఫార్మర్ ట్రిప్పింగ్ అయ్యిందని పేర్కొన్నారు. నిపుణుల సమక్షంలో ప్రస్తుతం ట్రాన్స్‌ఫార్మర్ మరమ్మతు పనులు చేస్తున్నామని వెల్లడించారు.