Share News

Sports Scholarship ‘ క్రీడా స్కాలర్‌షిప్‌’నకు దరఖాస్తుల ఆహ్వానం

ABN , Publish Date - Sep 29 , 2025 | 11:16 PM

Invitation for Applications to Sports Scholarship ప్రతిభావంతులైన క్రీడాకారులు ఓఎన్‌జీసీ స్కాలర్‌షిప్‌ కోసం దరఖాస్తు చేసుకోవచ్చని జిల్లా క్రీడాభివృద్ధి అధి కారి కె.శ్రీధరరావు సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. 21 క్రీడా విభాగాల్లో జూనియర్‌, సీనియర్‌ పురుషులు, మహిళా క్రీడాకారులకు నెలకు రూ.15 వేల నుంచి రూ.30 వేల వరకు అందించనున్నారని పేర్కొన్నారు.

  Sports Scholarship   ‘ క్రీడా స్కాలర్‌షిప్‌’నకు దరఖాస్తుల ఆహ్వానం

బెలగాం, సెప్టెంబరు29(ఆంధ్రజ్యోతి): ప్రతిభావంతులైన క్రీడాకారులు ఓఎన్‌జీసీ స్కాలర్‌షిప్‌ కోసం దరఖాస్తు చేసుకోవచ్చని జిల్లా క్రీడాభివృద్ధి అధి కారి కె.శ్రీధరరావు సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. 21 క్రీడా విభాగాల్లో జూనియర్‌, సీనియర్‌ పురుషులు, మహిళా క్రీడాకారులకు నెలకు రూ.15 వేల నుంచి రూ.30 వేల వరకు అందించనున్నారని పేర్కొన్నారు. 15 నుంచి 20 ఏళ్ల లోపు వారు అర్హులన్నారు. తల్లిదండ్రుల వార్షిక ఆదాయం రూ.5 లక్షల లోపు ఉండాలని తెలిపారు. అథ్లెటిక్స్‌, బ్యాడ్మింటన్‌, క్రికెట్‌, హాకీ, కబడ్డీ, టేబుల్‌ టెన్నిస్‌ తదితర క్రీడాకారులు నెల 21లోపు దరఖాస్తు చేసుకోవాలన్నారు.

Updated Date - Sep 29 , 2025 | 11:16 PM