Investigation Skills దర్యాప్తు నైపుణ్యాలు మెరుగుపరుచుకోవాలి
ABN , Publish Date - May 07 , 2025 | 11:47 PM
Investigation Skills Need to Be Improved దర్యాప్తు నైపుణ్యాలను మెరుగుపరుచుకోవాలని ఎస్పీ ఎస్‌వీ మాధవరెడ్డి సూచించారు. బుధవారం జిల్లా కేంద్రంలో పోలీసు అధికారులకు ఫోరెన్సిక్ ఎవిడెన్స్ మేనేజ్‌మెంట్‌పై ఒక్కరోజు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు.
పార్వతీపురం టౌన్, మే 7 (ఆంధ్రజ్యోతి): దర్యాప్తు నైపుణ్యాలను మెరుగుపరుచుకోవాలని ఎస్పీ ఎస్‌వీ మాధవరెడ్డి సూచించారు. బుధవారం జిల్లా కేంద్రంలో పోలీసు అధికారులకు ఫోరెన్సిక్ ఎవిడెన్స్ మేనేజ్‌మెంట్‌పై ఒక్కరోజు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘ఘటనా స్థలం నుంచి శాస్త్రీయ పద్ధతిలో ఆధారాల సేకరణే క్రియాశీలకం. ఫోరెన్సిక్ ఎవిడెన్స్‌లను సేకరించడం, భద్రపరచడం ఎంతో ముఖ్యం. నిందితులు ఎట్టి పరిస్థి తుల్లోనూ తప్పించుకోకూడదు. సాక్ష్యాఽధారాలను సేకరించే విధానంపై ప్రతిఒక్కరూ పట్టు సాధించాలి. అధునాతన సాంకేతిక టెక్నాలజీ సాయంతో దర్యాప్తు చేపట్టాలి.’ అని తెలిపారు. ఫోరెన్సిక్ ఆధారాల సేకరణ, చైన్ ఆఫ్ కస్టడీ మార్గదర్శకాలు, నేర పరిశోధనలో అనుసరించాల్సిన విధివిధానాలు, ఆధునిక శాస్త్రీయ ప్రమాణాలపై ప్రత్యేక నిపుణులు తెలియజేశారు. అనంతరం ఫోరెన్సిక్ నిపుణులను ఎస్పీ సత్కరించారు. ఈ కార్యక్రమంలో పాలకొండ డీఎస్పీ రాంబాబు, డీసీఆర్బీ సీఐ ఆదాం, సీసీఎస్ సీఐ అప్పారావు తదితరులు పాల్గొన్నారు.
1972కు సమాచారం అందించండి
ఎవరైనా డ్రగ్స్ రవాణా చేస్తున్నారనే తెలిస్తే వెంటనే 1972కు సమాచారాన్ని అందించాలని ఎస్పీ సూచించారు. మత్తు పదార్థాలు, మాదక ద్రవ్యాలపై ఈగల్ ఫోర్సు ఎస్పీ కె.నగేష్‌బాబు ఆద్వర్యంలో పట్టణంలోని వాసవీ కన్యాకాపరమేశ్వరి ఆలయంలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అన్నిటికన్నా ప్రమాదకరమైనవి డ్రగ్స్ అని, తెలిసి, తెలియకో వాటి బారిన పడితే ప్రతి ఒక్కరి జీవితం అంధకారమవుతుందని తెలిపారు. అనంతరం ‘డ్రగ్స్ వద్దు బ్రో’ పోస్టర్‌ను ఆవిష్కరించారు.