గ్రీన్‌గార్డు నియామకంపై విచారణ
ABN , Publish Date - Apr 24 , 2025 | 12:16 AM
మండలంలోని శివ్వాం పం చాయతీకి సంబంధించి గ్రీన్ గార్డు నియామకంపై బుధవారం విచారణ నిర్వహించారు. గ్రామానికి చెందిన పల్ల కృష్ణమూర్తినాయుడు కలెక్టర్‌కు గ్రీన్‌గార్డు విషయంపై ప్రజా సమస్యల పరిష్కార వేదికలో ఫిర్యాదు చేశా రు.
గరుగుబిల్లి, ఏప్రిల్ 23 (ఆంధ్రజ్యోతి): మండలంలోని శివ్వాం పం చాయతీకి సంబంధించి గ్రీన్ గార్డు నియామకంపై బుధవారం విచారణ నిర్వహించారు. గ్రామానికి చెందిన పల్ల కృష్ణమూర్తినాయుడు కలెక్టర్‌కు గ్రీన్‌గార్డు విషయంపై ప్రజా సమస్యల పరిష్కార వేదికలో ఫిర్యాదు చేశా రు. ఈమేరకు కలెక్టర్ పార్వతీపురం డీఎల్‌పీవో ఎం.నాగభూషణరావును విచారణ అధికారిగా నియమించారు. శివ్వాం పరిధిలో రెండేళ్లుగా గ్రీన్‌గార్డు నియమించలేదని, గతంలో విధులు నిర్వహించిన వ్యక్తి విధులు నిర్వ హించకుండాఉన్నారని, గ్రీన్‌గార్డుగా ఉంటూ మరో ఉద్యోగం చేస్తున్నాడని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఒకే వ్యక్తి రెండు విధులు ఎలా నిర్వహిస్తారని ప్రశ్నించారు. కాగా గ్రామస్థాయిలో పూర్తిస్థాయిలో సమాచారం సేకరిం చామని డీఎల్‌పీవో తెలిపారు. వాస్తవాలను పరిశీలించి చర్యలు నిమిత్తం ఉన్నతాధికారులకు నివేదిస్తామని చెప్పారు. అలాగే శివ్వాం పంచాయతీకి సంబందించి పూర్తిస్థాయిలో రికార్డులు పరిశీలిస్తామని, రికార్డుల్లో తప్పి దాలు, దిద్దుబాట్లు నెలకొంటే శాఖాపరమైన చర్యలు తప్పవన్నారు. కార్య క్రమంలో సర్పంచ్ రాయల పోలయ్య, కార్యదర్శులు బి.అప్పారావు, ఎన్.రవి కుమార్ పాల్గొన్నారు.