Share News

ఉణుకూరు ఫీల్డ్‌ అసిస్టెంట్‌పై విచారణ

ABN , Publish Date - Sep 16 , 2025 | 11:50 PM

ఉణుకూరు ఫీల్డ్‌అసిస్టెంట్‌ జగన్నాథం నాయుడు అనర్హులకు ఉపాధి పనులు వర్తింపచేస్తున్నారని అదే పంచాయతీ పరిధిలోని పోరాం గ్రామానికి చెందిన పోరెడ్డి విశ్వనాథం ఇటీవల పీజీఆర్‌ఎస్‌లో ఫిర్యాదు చేశారు.

 ఉణుకూరు ఫీల్డ్‌ అసిస్టెంట్‌పై విచారణ

రేగిడి, సెప్టెంబరు 16(ఆంధ్రజ్యోతి): ఉణుకూరు ఫీల్డ్‌అసిస్టెంట్‌ జగన్నాథం నాయుడు అనర్హులకు ఉపాధి పనులు వర్తింపచేస్తున్నారని అదే పంచాయతీ పరిధిలోని పోరాం గ్రామానికి చెందిన పోరెడ్డి విశ్వనాథం ఇటీవల పీజీఆర్‌ఎస్‌లో ఫిర్యాదు చేశారు. ఈనేపథ్యంలో మంగళవార ం స్థానిక ఏపీవో శ్రీనివాసరావు ఫీల్డ్‌అసిస్టెంట్‌ను, ఫిర్యాదుదారున్ని వేర్వురుగా విచారించారు. గ్రామానికి చెంది న అంగన్‌వాడీ కార్యకర్తకు వర్కు డిమాండ్‌ ఇవ్వటం, ఇంకా అనర్హులకు జాబ్‌ కార్డులు ఇచ్చి హౌసింగ్‌ బిల్లులు ఇవ్వటం అభ్యంతరకరమని ఏపీవోకు ఫిర్యాదు దారుడు నివేదించారు. తాను ఎటువంటి అవకతవకలకు పాల్పడలేదని, జాబ్‌ కార్డులు అర్హులేకే జారీ చేశానని ఆధారాలతో ఫీల్డ్‌అసిస్టెంట్‌ విచారణ అధికారికి నివేదించారు. అంగన్‌వాడీ కార్యకర్తకు వర్కు డిమాండ్‌ ఇవ్వటంపై రికార్డులు పరిశీలించి.. ఎంపీడీవోకు సమగ్ర నివేదిక అందిస్తానని ఏపీవో తెలిపారు.

Updated Date - Sep 16 , 2025 | 11:50 PM